వీర మహిళలకు తోబుట్టువుల్లా తోడుంటాం
- రాజకీయ, సామాజిక అంశాల్లో మహిళా శక్తి చాలా కీలకం
- ఎమ్మెల్సీ, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు
జనసేన వీర మహిళలు ప్రతీ ఒక్కరికీ తోబుట్టువుల్లా తోడుంటామని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు భరోసానిచ్చారు. మహిళలను అనాదిగా నాలుగు గోడలకే పరిమితం చేసిన పరిస్థితుల నుంచి నేడు విద్య, వ్యాపార, సాంకేతిక పరిజ్ఞానంలో మహిళలే ముందుండే స్థాయికి ఎదిగారని, ముఖ్యంగా రాజకీయ, సామాజిక అంశాల్లో మహిళా శక్తి చాలా కీలకంగా మారనున్నదని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖపట్నం జిల్లాకు చెందిన వీర మహిళలతో నాగబాబు సమావేశం అయ్యారు. ప్రతీ వీర మహిళ చెప్పిన సమస్యలను, సలహాలను అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళతామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో విశాఖ నార్త్ ఇంచార్జీ పసుపులేటి ఉషా కిరణ్, జీవీఎంసీలో జనసేన ఫ్లోర్ లీడర్ భీశెట్టి వసంత ల,క్ష్మీ వీర మహిళా రీజినల్ కో ఆర్డినేటర్ నాగలక్ష్మి, దుర్గా, సుధ, శారణి దేవి, వీర మహిళలు పాల్గొన్నారు.