విజయవాడ ఆర్టీసీ పాత బస్టాండ్ స్థలాన్ని బడా కంపెనీలకు కట్టబెట్టే హక్కు ప్రభుత్వానికి లేదు

0

విజయవాడ ఆర్టీసీ పాత బస్టాండ్ స్థలాన్ని బడా కంపెనీలకు కట్టబెట్టే హక్కు ప్రభుత్వానికి లేదు

లూలూ కంపెనీకి మేలు చేస్తూ విజయవాడకు, రాష్ట్రానికి హాని చేస్తున్న కూటమి ప్రభుత్వం

స్థానిక వ్యాపారాలను దెబ్బతీసి లులు సంస్థకు దాసోహం అంటున్న సర్కార్

విజయవాడ నగర ప్రణాళిక బద్ధమైన అభివృద్ధిని, పర్యావరణాన్ని నాశనం చేస్తున్న పాలకులు

ఆర్టీసీ ప్రైవేటీకరణకు ప్రభుత్వం కుట్ర

విజయవాడను, స్థానిక వ్యాపారాలను, ఆర్టీసీని, ప్రభుత్వ స్థలాలను కాపాడుకుంటాం

ఆర్టీసీ, ప్రభుత్వ స్థలాల జోలికి ప్రభుత్వం , లులు వస్తే… అడ్డుకుంటాం, విజయవాడ నగరాన్ని పరిరక్షించుకుంటాం

పౌర వేదిక ఆధ్వర్యంలో “ఆర్టీసీ స్థలాల పరిరక్షణ కమిటీ” ఏర్పాటు

ఆగస్టు 6వ తేదీన పాత బస్టాండ్ వద్ద మహా ధర్నా

ఉమ్మడి ఆందోళనకు నిర్ణయం

ఆర్టీసీ పాత బస్టాండ్ స్థలాన్ని లులు కంపెనీకి కారుచౌకగా 99 సంవత్సరాలు లీజుకు ఇవ్వటాన్ని నిరసిస్తూ విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం

నేడు విజయవాడ బాలోత్సవ భవన్ లో విజయవాడ పౌరవేదిక ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో నగర ప్రముఖులు, సామాజికవేత్తలు, న్యాయవాదులు, మేధావులు ఆర్టీసీ, ఇతర కార్మిక ఉద్యోగ సంఘ నేతలు, వ్యాపార వాణిజ్య సంఘాల ప్రతినిధులు, పౌర, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మాజీ మంత్రి, రైతు నేత వడ్డే శోభనాద్రిశ్వరరావు, మాజీ మేయర్ జంధ్యాల శంకర్, ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్, ఆర్టిసి ఉద్యోగ నేతలు పి.దామోదర్, సుందరయ్య, జన చైతన్య వేదిక నేత లక్ష్మణ్ రెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు కొనకళ్ళ విద్యాధరరావు, పౌర సంఘాల నేతలు సిహెచ్.బాబురావు, డి.కాశీనాథ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు

సుంకర రాజేంద్రప్రసాద్ కన్వీనర్ గా పౌర వేదిక ఆధ్వర్యంలో “ఆర్టీసీ స్థలాల పరిరక్షణ కమిటీ” ఏర్పడింది

రౌండ్ టేబుల్ సమావేశం ఈ కింది తీర్మానాన్ని ఆమోదించింది.

విజయవాడ పాత ఆర్టీసీ బస్టాండ్ 4.17 ఎకరాల స్థలం, విశాఖపట్నంలో 13.5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని లులు మాల్ ఇంటర్నేషనల్ సంస్థకు లీజుకు ఇస్తూ విడుదల చేసిన 137  జీవో రద్దు చేయాలి.

 ఆర్టీసీ సంస్థను దెబ్బతీసే ఈ ఆదేశాలను ఉపసంహరించాలి

స్థానిక వ్యాపారులను, ఉపాధిని నాశనం చేసే రీతిలో ప్రభుత్వం బడా కంపెనీలకు ప్రోత్సహించడం తగదు

నగరంలో ఖాళీ స్థలాలను బడా సంస్థలకు కేటాయించి నిర్మాణాలు చేపట్టటం వలన పర్యావరణానికి ముప్పు కలుగుతుంది. ప్రణాళిక
బద్ధమైన అభివృద్ధిని నాశనం చేస్తుంది. నగరం నడిబొడ్డున భారీ నిర్మాణాలతో ట్రాఫిక్ రద్దీ పెరిగి నగర జీవనం అస్తవ్యస్తంగా మారుతుంది

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవో.. నిబంధనలకు, చట్టాలకు విరుద్ధం. లూలూకి 99 సంవత్సరాల పాటు నామమాత్రపు ధరకు లీజుకి ఇవ్వటం అధికార దుర్వినియోగం.

ఆర్టీసీ, ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలి. చిన్న, మధ్యతరగతి వ్యాపారులను కాపాడాలి.

విజయవాడ పర్యావరణాన్ని పరిరక్షించాలి. ట్రాఫిక్ చక్రబంధము నుండి విముక్తి కల్పించాలి.

లూలూకి ఆర్టీసీ భూముల కేటాయింపుకు వ్యతిరేకంగా ఉమ్మడిగా ఉద్యమించాలి.

ఆగస్ట్ ఆరో తేదీన ఉమ్మడిగా మహాధర్నా నిర్వహించాలి.

జీవో రద్దు అయ్యే వరకు వరకు ఉమ్మడిగా పోరు సాగించాలి.

వడ్డే శోభనాద్రిశ్వరరావు మాట్లాడుతూ.

హెరిటేజ్ షేర్లు అమ్మినట్లుగా ఆర్టీసీ ప్రభుత్వ స్థలాలు అమ్మటానికి చంద్రబాబుకు హక్కు లేదు

గతంలోనూ చంద్రబాబు పిడబ్ల్యుడి గ్రౌండ్స్, విద్యుత్ సౌదా, మున్సిపల్ కార్యాలయం, కృష్ణానది తీరం.. బడా కార్పొరేట్లకు కట్టబెట్టడానికి ప్రయత్నించారు. విజయవాడ నగర ప్రజలు ఉమ్మడిగా వాటిని తిప్పికొట్టారు

ఈ ప్రభుత్వానికి భూదాహం పట్టుకున్నది

పౌర సమాజం ఉమ్మడిగా స్పందించాలి, లులు  కంపెనీ ను అడ్డుకుందాం. ఆర్ టి సి ని
కాపాడుకుందాం

ఎటువంటి పోరాటానికైనా సిద్ధం

జంధ్యాల శంకర్ .

పాలకుల అనాలోచిత నిర్ణయాల వల్ల నగరాలు దెబ్బతింటున్నాయి

పర్యావరణ పరిరక్షణను అన్ని ప్రభుత్వాలు విస్మరించాయి

లులుకి ఆర్టీసీ స్థలం కేటాయింపుతో ట్రాఫిక్ రద్దీ మరింత పెరిగి నగర ప్రజలకు అవస్థలు మిగులుతాయి

ప్రణాళికలకు భిన్నంగా అక్రమ కట్టడాలు, అడ్డగోలు కేటాయింపులు తగవు

ప్రభుత్వాలు దీర్ఘకాలిక దృష్టితో పౌర ప్రయోజనాల కోసం ఆలోచించాలి

లులు మాల్ స్థలం కేటాయింపు జీవో అనాలోచితమైనది. ప్రభుత్వం పునరాలోచించాలి

సుంకర రాజేంద్రప్రసాద్ .

విజయవాడ పాత ఆర్టీసీ బస్టాండ్ నుండి కరేడు వరకు ప్రభుత్వం అడ్డగోలుగా బడా కంపెనీలకు, వ్యక్తులకు  భూముల పందారం చేస్తోంది. కార్పొరేట్లకు దాసోహం అంటోంది

రైతులు, ప్రజా ప్రయోజనాలను విస్మరిస్తోంది

భూముల కేటాయింపులపై ప్రభుత్వం న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది

న్యాయపోరాటంతో పాటు ప్రజా పోరాటం కీలకం

పలిశెట్టి దామోదర్ రావు, సుందరయ్య…

ప్రభుత్వం క్రమంగా ఆర్టీసీను దెబ్బ తీస్తోంది. ఉద్యోగులను కుదిస్తోంది. ఆర్టీసీ స్థలాలను తెగనమ్ముతోంది

విద్యుత్ బస్సుల పేరుతో క్రమంగా ప్రైవేటీకరణ వేగవంతం చేసింది

ఉచిత బస్ పథకం అమలు జరగాలంటే ఆర్టీసీని బలోపేతం చేయాలి

లూలుకి భూముల కేటాయింపు ఆపాలి, ఆర్టీసీని కాపాడటానికి ఉద్యోగులందరూ ప్రజలతో కలిసి
పోరాడుతాం

వి లక్ష్మణ రెడ్డి

కూటమి ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలు విస్మరించి బడా కంపెనీల ప్రయోజనాలను కాపాడుతోంది

రాష్ట్రంలో రైతుల భూములను బలవంతంగా గుంజుకుంటున్నది

పౌర సమాజం పార్టీలకతీతంగా ఉద్యమించాలి

కొనకళ్ల విద్యాధరరావు…

ఇప్పటికే రిటైల్ వర్తక రంగంలోకి బడా కంపెనీల ప్రవేశం వల్ల చిన్న, మధ్యతరగతి వ్యాపారులు దెబ్బ తిన్నారు

లులు మాల్ స్థానిక వ్యాపారుల పాలిట శాపం అవుతుంది

వ్యాపారులను వేధించి, లులు, బడా కంపెనీలకు పాలకులు ఊడిగం చేయటం బాధాకరం

సిహెచ్ బాబురావు.

విజయవాడ నగరానికి ప్రభుత్వాలు ఏమీ చేయలేదు. అభివృద్ధి విస్మరించాయి. పరిశ్రమలు లేవు, ఉపాధి చూపటం లేదు, ప్రభుత్వ భూములను మాత్రం తెగ నమ్ముతున్నారు

ఒకవైపు మెట్రో కోసం ప్రైవేటు భూములు తీసుకుంటూ, మరోవైపు ఆర్టీసీ భూములను బడా కంపెనీలకు కట్టబెట్టడం శోచనీయం

విజయవాడలోని ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం గర్హనీయం

సమావేశానికి టాక్స్ పేయర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎంవి. ఆంజనేయులు అధ్యక్షత వహించగా పౌర వేదిక నాయకులు యార్లగడ్డ రమేష్ స్వాగతం పలికారు

ఈ సమావేశంలో సంపర శ్రీనివాస్ ( ఐలు, న్యాయవాది) అక్కినేని భవాని ప్రసాద్ (రైతు
ప్రముఖులు), వై కేశవరావు (రైతు నేత), రెడ్డి (హోటల్ ఓనర్స్ అసోసియేషన్), జి.ధన శేఖర్
(సామాజిక కార్యకర్త) మురహరి (ఆర్టీసీ పెన్షన్ దారుల సంఘం) ముత్తం శెట్టి ప్రసాద్ బాబు
(న్యాయవాది), వి.సాంబిరెడ్డి (మాజీ ప్రిన్సిపాల్) బి.రమణ, కె.దుర్గారావు, ఇవి.నారాయణ, (సిఐటియు) బోయి సత్యబాబు, (కార్పొరేటర్), పి.కృష్ణ (యువజన నేత) తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version