శ్రీవారి ఆలయం ముందు రీల్స్ చేస్తే కఠిన చర్యలు.. తిరుమల తిరుపతి దేవస్థానం వారు హెచ్చరిక
తిరుమల శ్రీవారి ఆలయం ముందు, మాడ వీధుల్లో కొంతమంది వెకిలి చేష్టలు, డ్యాన్స్‌లతో రీల్స్ చేస్తుండటంపై తితిదే ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇలాంటి వీడియోలు చిత్రీకరించేవారిని తితిదే విజిలెన్స్ సిబ్బంది గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించింది.
భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఈ తరహా చర్యలు ఆధ్యాత్మిక వాతావరణానికి విఘాతం కలిగిస్తున్నాయని పేర్కొంది.