10-06-2025రాష్ట్ర మహిళలకు వై.ఎస్.భారతి రెడ్డి , కృష్ణంరాజు బహిరంగ క్షమాపణలు చెప్పాలి పశ్చిమ నియోజవకర్గంలో మహిళ, యువజన విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీవెస్ట్ టిడిపి కార్యాలయం నుంచి చిట్టినగర్ వరకు సాగిన ర్యాలీవిజయవాడ : ఎమ్మెల్యే జగన్ రెడ్డి, సాక్షి నిర్వహకురాలు వై.ఎస్.భారతి రెడ్డి మెప్పు కోసం అమరావతి రాజధాని నిర్మాణ పనులు అడ్డుకునేందుకు, విషం చిమ్మే కుట్రలో భాగంగా సాక్షి మీడియాలో మహిళలను కించపరిచే విధంగా మాట్లాడితే సహించేది లేదు. సాక్షి టీవీ ఛానెల్ లో అమరావతి మహిళలను అవమానపరిచే విధంగా మాట్లాడిన ఎనలిస్ట్ కృష్ణంరాజు, అమరావతి రాజధాని పై విషం చిమ్మేందుకు సహకరించినందుకు సాక్షి మీడియా నిర్వహకురాలు వై.ఎస్.భారతి రెడ్డి రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని మహిళ, యువజన విద్యార్ధి సంఘాలు,అమరావతి మహిళలు డిమాండ్ చేశారు. మహిళలను అవమానపరిచే విధంగా మాట్లాడి భావ స్వేచ్ఛ ప్రకటన వుందని చెప్పుకోవటం సిగ్గు చేటన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎవరు సహించేది లేదని, దేనికైనా ఒక హద్దు వుంటుందని హెచ్చరించారు.పశ్చిమ నియోజకవర్గంలో మంగళవారం మహిళ, యువజన విద్యార్ధి సంఘాలు, అమరావతి మహిళల ఆధ్వర్యంలో సాక్షి ఛానెల్ లో ప్రసారమైన వ్యాఖ్యలకు నిరసనగా భారీ ర్యాలీ జరిగింది. ఈ నిరసన ర్యాలీ పంజా సెంటర్ దగ్గర గల గణపతి రావు రోడ్డు లోని పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి చిట్టినగర్ సెంటర్ వరకు సాగింది. అమరావతి మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన ఎనలిస్టు కృష్ణంరాజు, సాక్షి మీడియా నిర్వహకురాలు వై.ఎస్.భారతి రెడ్డిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. ఈ నిరసన ర్యాలీలో ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళ ఉపాధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి, తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు షేక్ ఆశా, జనసేన కృష్ణ పెన్నా రీజనల్ కో ఆర్డినేటర్ రావి సౌజన్య, బిజెపి మహిళా మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ ఆఫీస్ సెక్రటరీ కర్రినాగలక్ష్మీ, పశ్చిమ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు సుఖాసి సరిత, పశ్చిమ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు ఆర్.మాధవ, పశ్చిమ నియోజకవర్గ టి.ఎన్.ఎస్.ఎఫ్ అధ్యక్షుడు భాను, టి.ఎన్.ఎస్.ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్, తెలుగు మహిళ కార్యనిర్వహక కార్యదర్శి మాదల చిన్నతల్లి, అంగన్వాడీ స్టేట్ మీడియా కో ఆర్డినేటర్ చెరుకూరి మాధవి, కార్పొరేటర్ ఉమ్మడి చంటి లతో పాటు పశ్చిమ నియోజకవర్గ అనుబంధ సంఘాల నాయకులు, డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు