కానూరు కు చెందిన గుమ్మడి తోట కాలువ కట్ట వాసుల ఇళ్లను తొలగించాలని రెవెన్యూ అధికారులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ పెనమలూరు MRO కి వినతి పత్రం అందించిన మన

0

కానూరు కు చెందిన గుమ్మడి తోట కాలువ కట్ట వాసుల ఇళ్లను తొలగించాలని రెవెన్యూ అధికారులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ పెనమలూరు MRO కి వినతి పత్రం అందించిన మన పెనమలూరు నియోజకవర్గం YSR కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి గత నలభై సంవత్సరాలు గా నివాసం ఉంటున్న వారిని అప్పటికప్పుడు నోటీసులు జారీ చేసి ఇళ్లను తొలగిస్తామనడం అన్యాయమని, 4వ తారీఖున నోటీసు లు జారీ చేసి 8వ తారీఖున వారికి నోటీసులు అందించి 11వ తారీకు నాటికీ ఇళ్లను తొలిగిస్తామని చెప్పడం సరైన పద్ధతి కాదని గత 40 సంవత్సరాలు గా ఎన్నో ప్రభుత్వాలు మారినప్పటికి పార్టీలకు అతీతంగా అక్కడ నివసిస్తున్న ప్రజలకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించారాని,గత పంచాయితీ గాని ఇప్పటి మున్సిపాలిటీ గాని వారి వద్ద ఇంటి పన్ను, నీటి పన్ను వసులు చేస్తున్నారని,ఒకవేళ వారిని ఆ ప్రాంతం నుండి పంపవలసిన పరిస్థితి ఉంటే వారికి ప్రభుత్వం తరుపున ప్రత్యామ్నాయంగా నివాస యోగ్యమైన స్థలం ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం సహాయం అందించి నిర్మాణం పూర్తయినా తర్వాత కట్ట మీద ఇళ్లను తొలగించాలనివారు నిరుపేదలు కాబట్టే ఆ కాలువ ప్రాంతం లో నివాసం వుంటున్నారని, ఏ ప్రత్యామ్నాయ మార్గం చూపకుండా వారి ఇళ్లని తొలగిస్తే వారు ఎక్కడికి వెళ్తారని ఆవేదన వ్యక్తం చేసారు.అంతేకాని పెద వర్గాల ప్రజలు అని వారిని వారి హక్కులకు విరుద్ధం గా ఏమైనా చర్యలు తీసుకుంటే YSR కాంగ్రెస్ పార్టీ సహించే ప్రసక్తి ఉండబోదని హెచ్చరించారు.పెనమలూరు మండల రెవెన్యూ అధికారి దృష్టి కి సమస్యని తీసుకెళ్ళామాని, జిల్లా కలెక్టర్ మరియు RDO గారికి కూడా POST ద్వారా పంపడం జరిగిందని తెలియజేసారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version