పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి గన్నవరం నియోజకర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు

0

 *20:11:2024*

పేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి

గన్నవరం నియోజకర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు

ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు అండగా నిలుస్తుందని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గన్నవరం నియోజకర్గం ఉంగుటూరు మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన మస్తాన్ వలికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన రూ.1,13,265/- సీఎంఆర్ఎఫ్ చెక్కును అలానే గన్నవరం మండలం సూరంపల్లికి చెందిన కొప్పుల సుశీలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన రూ.2,00,000 చెక్కును భదిత కుటుంబ సభ్యులకు బుధవారం గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అందజేశారు . ఆపదలో ఉన్న ఎన్నో కుటుంబాలను సీఎం సహాయ నిధి ఆపద్భందువునిగా అదుకుంటుందని ఆయన తెలిపారు. మానవతా దృక్పథంతో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ముఖ్య మంత్రి చంద్రబాబు ఆర్దిక సహాయాన్ని మంజూరు చేస్తున్నారని అన్నారు. బాధితులు అవసరమైన సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version