ఆధునిక కవి, సంఘ సంస్కర్త భక్త కనకదాసకు జయంతి సందర్భంగా నివాళులర్పించిన

0

 తేది : 18.11.2024

అమరావతి

 

ఆధునిక కవి, సంఘ సంస్కర్త భక్త కనకదాసకు జయంతి సందర్భంగా నివాళులర్పించిన

రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకు భక్త కనకదాస చేసిన కృషి మరవలేనిదని పేర్కొన్న మంత్రి కందుల దుర్గేష్

అమరావతి : సామాజిక తత్వవేత్త, సంగీత విద్వాంసుడు, ఆధునిక కవి భక్త కనకదాస జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఘన నివాళులర్పించారు. వెలగపూడిలోని అసెంబ్లీ హాలులో కనకదాస జయంతిని సోమవారం ఘనంగా నిర్వహంచారు. ఈ సందర్భంగా కనకదాస జీవిత విశేషాలను, రాయలసీమలో కుల వ్యవస్థ, అసమానతలపై తన కీర్తనల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన విధానాన్ని మంత్రి కందుల దుర్గేష్ స్మరించుకున్నారు. సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకు భక్త కనకదాస చేసిన కృషి మరవలేనిదని, ఆయన అనుసరించిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆచరణీయమని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version