రాష్ట్రానికి తల మానికంగా మల్ల వల్లి పారిశ్రామిక వాడ గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

0

 *18.11.2024*

రాష్ట్రానికి తల మానికంగా మల్ల వల్లి పారిశ్రామిక వాడ

గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

మల్లవల్లి పారిశ్రామిక వాడ రానున్న రోజుల్లో రాష్ట్రానికి తలమానికంగా మారనుందని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. సోమవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ మల్లవల్లి పారిశ్రామిక వాడ లో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కారం చేయాలని అలానే 479 ఎకరాల అసైన్డ్ భూమిని భూసేకరణ చేయాలని సంబంధిత మంత్రి నీ కోరారు . మరో 183 మంది పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. మల్లవల్లి పారిశ్రామిక వాడ లో ఫైర్ స్టేషన్ , పోలీస్ ఔట్ పోస్ట్ ఎడ్మినిస్టేషన్ బిల్డింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కారం చేయాలని కోరారు . మల్లవల్లిలో పారిశ్రామికవేత్తలకు ఎకరం 16.50 లక్షలకే ఇవ్వటం ఎన్డీఏ ప్రభుత్వం సుపరిపాలన కు నిదర్శనమన్నారు. గత ప్రభుత్వం మల్లవల్లిలో భూములను ఎకరం 89 లక్షలకు పెంచిందని గత ప్రభుత్వంలో మలవల్లి ఇండస్ట్రియల్ ఏరియా పరిస్థితి అతీగతీ లేకుండా పోయిందని విమర్శించారు. మలవల్లి ఇండస్ట్రియల్ ఏరియా లో అశోక్ లేలాండ్ వారితో మాట్లాడి మళ్లీ రీఓపెనింగ్ చేయించడం జరిగిందన్నారు. హోసూరు మాదిరిగా మల్లవల్లి పారిశ్రామికవాడగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version