మాజీ మంత్రివర్యులు వెలంపల్లి శ్రీనివాసరావు కామెంట్స్

0

 తిరువూరు ఎన్నికల్లో టిడిపి దౌర్జన్యం పై ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్నికి వినతిపత్రం అందజేసిన వైసిపి నేతలు, కౌన్సిలర్లు

మాజీ మంత్రివర్యులు వెలంపల్లి శ్రీనివాసరావు కామెంట్స్

ఎన్టీఆర్ జిల్లాలో లోని తిరువూరు మునిసిపాలిటీ లో 20 మందిలో 17 మంది వైసిపి గెలిస్తే ముగ్గురు టిడిపి వాళ్ళు గెలవడం జరిగింది

ముగ్గురుతో మున్సిపల్ చైర్మన్ ఎన్నికలలో ఎలా గెలుస్తారు

కనీసం చైర్మన్ అభ్యర్థి కూడా టిడిపి లో గెలిచిన కౌన్సలర్ కాదు

వైస్ చైర్మన్ అని కూడా కౌన్సలర్లని కూడా చూడకుండా, మహిళలని కూడా చూడకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు

పోలీసులు ఖాకి చొక్కాలు తీసి పచ్చ చొక్కాలు వేసుకొని పనిచేస్తున్నారు

కౌన్సిలర్ నిర్మల కౌన్సిల్ కి వెళ్ళితే పోలీసులు ఆమెను చుట్టుముట్టి మేడలో ఉన్న వైసిపి కండువాను తీసి చెట్లలో పడేసారు

డిసిపి ప్రసాద్ రావు అక్కడున్న మహిళా పోలీసులతో ఆమెను బలవంతంగా పక్కకి తీసుకువెళ్లి దుర్మార్గంగా వ్యవహరించారు

ఎన్టీఆర్ జిల్లాలో పోలీసుల వ్యవస్థ పనిచేస్తుందా అన్ని పోలీస్ కమిషనర్ ని ప్రశ్నిస్తున్నాను

కౌన్సలర్ అంటే ప్రజాప్రతినిధి వారికీ స్వచ్చందంగా ఓటు వేసుకునే హక్కు లేకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు

ఎన్నికల కమిషనర్ ని కలిసి జరిగిన సంఘటనలను ఆమెకు వివరించి, సిసి ఫూటేజ్లతో కలిపి లిఖితపూర్వకంగా వినతి పత్రం అందించడం జరిగింది

ఎన్నికల కమిషనర్ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు

ఎన్నికలు సజావుగా జరిగితే మళ్లి వైసిపి మునిసిపల్ పదవి కైవసం చేసుకుంటుందనే దురుద్దేశంతో, దుర్మార్గపు ఆలోచనతో అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే తెలుగు దేశం పార్టీ నాయకులు ఎన్నికలు జరగకుండా అడ్డుకున్నారు

వైసిపికి 17 మంది కౌన్సిలర్లు ఉన్నారు వారందరు జగనన్న ఎవరి పేరు చెపితే వారికీ ఓటేస్తామంటున్నారు

మహిళలని కూడా చూడకుండా వారి పై చెప్పులు విసురుతూ, రాళ్లు విసురుతున్న పోలీసులు మాత్రం ప్రేక్షపాత్ర పోషించారు

పోలీసులందరు తెలుగుదేశం పార్టీ తొత్తులాగ పనిచేయడం బాధాకరం, పొలిసు వ్యవస్థ మారాలి, ప్రతి ఒక్కరికి భద్రత కల్పించి స్వచ్చందం ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు కల్పించాలి

ఎన్నీ ఇబ్బందులకు గురి చేసిన, ఆర్ధికంగా ప్రలోభపెట్టిన మాకు జగన్ మోహన్ రెడ్డి నాయకత్వమే కావాలని నిలబడిన కౌన్సిలర్లందరికి నా అభినందనలు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version