ప్రజల దాహార్తిని తీర్చేందుకు సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటికే 86 చలివేంద్రాలను ఏర్పాటు చేసి మజ్జిగ, చల్లని మంచినీరు పంపిణీ చేస్తున్నాం -MLA బొండా ఉమ

0

 19-5-2025

ప్రజల దాహార్తిని తీర్చేందుకు సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటికే 86 చలివేంద్రాలను ఏర్పాటు చేసి మజ్జిగ, చల్లని మంచినీరు పంపిణీ చేస్తున్నాం -MLA బొండా ఉమ

అధికారంలో ఉన్న లేకున్నా ప్రజలకు సేవ చేయడమే 25 సంవత్సరాలుగా కృషి చేస్తున్నాం – MLA బొండా ఉమ

ధి:19-5-2025 సోమవారం ఉదయం 11:00″గం లకు ” సెంట్రల్ నియోజకవర్గంలోని 64వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాకొల్లు.రవికుమార్ ఆధ్వర్యంలో వేసవి కాలం దృష్ట్యా ఏర్పాటుచేసిన మజ్జిగ పంపిణీ కేంద్రాలను ప్రారంభించడం జరిగింది

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు విచ్చేసి చలివేంద్రాన్ని ప్రారంభించి పాదచారులకు మరియు వాహనదారులకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది

ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ వేసవిలో పాదచారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ వేసవికాలంలో ప్రజలకు ఎటువంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా ప్రభుత్వం తరఫున అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని

తప్పనిసరి అయితేనే తప్ప ప్రజలు మధ్యాహ్నం పూట ఎలా నుండి బయటకు రావద్దని, వచ్చిన తగు జాగ్రత్తలు తీసుకొవాలి అని, నియోజకవర్గంలోని పలు డివిజన్ లలో, జన సంచారం ఎక్కువగా ఉండే కూడలి సెంటర్లలో మా తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు పాఠశాలలకు వాహనదారులకు మజ్జిగ పంపిణీ కేంద్రాలు, చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీరుస్తున్నారని

ఈరోజు ఈ ప్రాంతంలో 2 చలివేంద్రాలను ఏర్పాటు చేసి ఎండాకాలం వెళ్లే వరకు కూడా దీనిని కొనసాగిస్తారని నియోజకవర్గంలో ఇప్పటికే పలు ప్రాంతాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేశామని, తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ప్రజల శ్రేయస్సు కోరుతుంది అని, ఇలాంటి సేవా కార్యక్రమాలు నియోజకవర్గంలో మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారిని అభినందించారు

 ఈ కార్యక్రమంలో సెక్రటరీ SK బాబు, KK బాబు, రాజేష్, వరలక్ష్మి,కాకొల్లు సాయి చరణ్, జయరాజ్, పలాగని భాగ్యలక్ష్మి, తెల్ల భవాని, కోరాడ రమణ, పలాగని శివ, రాజ్యలక్ష్మి, దిలీప్, తదితరులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version