దేశభక్తిని పెంపొందించేలా హర్ ఘర్ తిరంగా

0

దేశభక్తిని పెంపొందించేలా హర్ ఘర్ తిరంగా

  • ప్రతి ఇంటిపైనా జాతీయ పతాకం ఎగురవేయాలి
    జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
    విజయవాడ ఆగష్టు 04: ఆజాదీ కా అమృత్ మహోత్సావ్ లో భాగంగా ప్రతి ఒక్కరిలో దేశ భక్తిని పెంపొందించేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు . హర్ ఘర్ తిరంగా 2025 సందర్భంగా ప్రచార పోస్టర్ ను సోమవారం జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో విడుదల చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రజలలో దేశ భక్తిని మరింతగా పెంపొందించేలా జిల్లా అంతటా పలు కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ నెల 8 వరకు పాఠశాల, అన్ని విద్యా సంస్థలలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించాలన్నారు తెలిపారు. ప్రభుత్వ భవనాలను అలంకరించడం విద్యార్ధులకు తిరంగా రంగోలి, తిరంగా రాఖి మేకింగ్ వర్క్ షాప్స్ , తిరంగా వేవ్స్ అండ్ త్రెడ్స్ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. 9 నుండి 12వ తేదీ వరకు తిరంగా మహోత్సవ్ పేరుతో ప్రజా ప్రతినిధులు , వి.ఐ.పి లు పాల్గొనేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని , ఇందులో స్థానిక ఉత్పత్తులతో డ్వాక్రా మహిళలతో తిరంగా కలర్ థీం తో ప్రత్యేక తిరంగా మేళా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. హర్ ఘర్ తిరంగా సేల్ఫీ బూత్ లను ఏర్పాటు చేయడం , ఫోటోలను www.harghartiranga.com వెబ్సైటు నందు అప్లోడ్ చేయడం వంటి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. తిరంగా బైక్ ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాస్థాయి నుండి గ్రామ స్థాయి వరకు తిరంగా యాత్ర 13 నుండి 15 వ తేదీ వరకు ప్రభుత్వ భవనాలను, పాఠశాలలను, హోటళ్ళ ను, వంతెనలు, డ్యాం లను విద్యుదీకరించి, అలంకరించి జాతీయ జెండాలను ఎగుర వేయడానికి సిద్ధం చేయాలన్నారు ఈ కార్యక్రమాలకు పెద్దఎత్తున ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ లక్ష్మీశ కోరారు.
    పోస్టర్ విడుదల కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, డి ఆర్ ఓ ఎం. లక్ష్మీనరసింహం, యువజన సంక్షేమ అధికారి కె.శ్రీనివాసరావు, డి ఎం అండ్ హెచ్ ఓ ఎం.సుహాసిని తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version