ఇప్పటివరకు సెంట్రల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ హయాంలో సుమారు రూ.8.5 కోట్ల వరకు సీఎం సహాయ నిధి

0

4-8-2025

ఇప్పటివరకు సెంట్రల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ హయాంలో సుమారు రూ.8.5 కోట్ల వరకు సీఎం సహాయ నిధి మంజూరు చేసి లబ్ధిదారులకు చిక్కుల పంపిణీ చేశాం -MLA బొండా ఉమ

నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటూ వైద్య సహాయం కోసం సీఎం చంద్రబాబు కి అందించిన నిధులు తమకు అందేలా కృషి చేసిన MLA బొండా ఉమ కి బాధితులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు

(LOC ) CMRF దీనిద్వారా సాయం పొందుతున్న లబ్ధిదారులు, ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, వారు ఆరోగ్యం బాగుండాలని MLA బొండా ఉమ ఆకాంక్షించారు

ధి:4-8-2025 సోమవారం ఉదయం 11:30″గం లకు” సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు 32వ డివిజన్ అయోధ్యనగర్ కు చెందిన పేరుమల్ల పూర్ణచంద్రరావు కు ₹1 లక్ష 37871 రూపాయలు, పెందం శ్రీనివాసరావు కు ₹78,213 రూపాయలు, మేకతోటి రాజ్ కుమార్ కు ₹30,100 రూపాయలు మరియు 63వ డివిజన్ రాజీవ్ నగర్ కు చెందిన కుప్పనీటి కోటేశ్వరరావు కు ₹42,103 రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిది (CMRF) చెక్కులను  ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు లబ్ధిదారులకు శాలువాలు కప్పి పట్టాలను అందజేశారు…

ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు అండగా నిలుస్తుంధి అని, అత్యవసర పరిస్థితుల్లో ఉండి వైద్యం చేయించుకోలేని వారికి  చేయూతనిస్తూ ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను ప్రతిరోజు కూడా MLA కార్యాలయంలో లబ్ధిదారులకు పారదర్శకంగా ఎటువంటి అవినీతి జరగకుండా అందిస్తున్నామని.

అనారోగ్యంతో బాధపడుతూ కార్పొరేట్ స్థాయిలో వైద్యం పొందలేని బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిది అండగా నిలుస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం  ప్రభుత్వ వైద్యశాలలో కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తుందని మెరుగైన వైద్య నిమిత్తం వివిధ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందిన బాధితులకు వారు చెల్లించిన నగదు రసీదులను ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకుంటే విచారించిన అనంతరం క్షతగాత్రులకు ముఖ్యమంత్రి సహాయ నిధిని కూటమి ప్రభుత్వం అందిస్తుంది అని

ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని పరిరక్షించడంతోపాటు మెరుగైన సమాజాన్ని అందించాలనే ఆలోచన విధానంతో ముఖ్యమంత్రి వర్యులు నారాచంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని ఆయన సేవలు రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి అన్నారు, అదేవిధంగా నియోజకవర్గంలో ప్రతి ప్రజా సమస్య పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టామని.

టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛను 4వేల రూపాయలు చేశామని, కొత్త పింఛన్లు కూడా అందిస్తున్నాం అని, అన్న క్యాంటీన్లు ప్రారంభించామని, మహిళా అభ్యున్నతి దిశగా పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసిందని, మహిళలందరికీ ఈ నెల 15వ తేదీ నుంచి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని కూడా సిద్ధం చేసాం అని, రానున్న కాలంలో సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గం గ, సమస్యలు లేని నియోజకవర్గం గ తీర్చి దిద్దుతాం అని, ప్రజల కోసం పనిచేసే MLA ఉంటే ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుందో చేసి చూపుతానని బొండా ఉమా తెలియజేసారు

ఈ కార్యక్రమంలో:- 32 వ డివిజన్ కార్పొరేటర్ చెన్నగిరి రామ్మోహన్రావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, డివిజన్ అధ్యక్షులు బొలిశెట్టి శేషుబాబు, సెక్రటరీ N నవీన్, ఇంచార్జీ వెలగ సురేష్, 63వ డివిజన్ అధ్యక్షులు లాభా వైకుంఠం, పెద్ది శ్రీను, బాబు రావు, సత్యనారాయణ, సునీల్ తదితరులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version