తిరుమలలో ముగిసిన టీటీడీ,దేవాదాయశాఖ సంయుక్త సమావేశం

0

తిరుమల
12-07-2025

తిరుమలలో ముగిసిన టీటీడీ,దేవాదాయశాఖ సంయుక్త సమావేశం

సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించిన మంత్రి ఆనం :

చైర్మన్,ఈవో,అదనపు ఈవో,దేవాదాయ శాఖ అధికారులతో కలిసి సమీక్ష చేశాం

గతంలో సీఎం చంద్రబాబు దగ్గర జరిగిన సమావేశంలో ఆలయాలకు సంబంధించిన కొన్ని సమస్యలు ముందుకు వచ్చాయి

వాటిని చర్చించుకొని రండి అని సీఎం చంద్రబాబు ఆదేశించారు

దేవాదాయ చట్టం ప్రకారం 9 శాతం కామన్ గుడ్ ఫండ్ టీటీడీ నుంచి తీసుకోవాల్సిన నిబంధనలు ఉన్నాయి

గతంలో 5 శాతం ఉన్న దానిని 9 శాతంకు పెంచాం

రాష్ట్రంలో ఉన్న అర్చక నిరుద్యోగులుగా ఉన్న అర్చక స్వాములకు భృతి ఇవ్వాలనీ మేనిఫెస్టో ఉంది

ఆ మేరకు రాష్ట్రంలో 590 వేద పండితులు రాష్ట్రంలో నిరుద్యోగులుగా ఉన్నారు

వారికి 3 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం

శ్రీవాణి ట్రస్టు ద్వారా రాష్ట్రంలోని పునర్ నిర్మాణంలో ఉన్న ఆలయాలకు 147 కోట్లు విడుదల కాగా నిలిచిపోయాయి

శ్రీవాణి ట్రస్టు ద్వారా మరో 11 కోట్లు నిధులు మిగతా ఆలయాలకు రావాల్సి ఉంది

వీటింటిని చర్చించి నిర్ణయం తీసుకుంటామని బోర్డు,అధికారులు చెప్పారు

విజయవాడ దుర్గ గుడికి వెళ్లేందుకు మరో రోడ్డు మార్గం వేసేందుకు టీటీడీ సహకారం కావాలి

టీటీడీలో అన్యమతస్థులు ఉండేది వాస్తవం

కేంద్రమంత్రి బండి సంజయ్ టీటీడీలో పనిచేస్తున్న వేయి మంది అన్యమతస్థులు ఉన్నారన్న దానిపై విచారణ కొనసాగుతుంది

టీటీడీ కాలేజీ,పాఠశాలల్లో ఉన్న 192 పోస్టులను ఒప్పంద లెక్చరర్ లతో భర్తీ చేసేందుకు చర్చించాం

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version