డ్రోన్ సర్వేలన్స్ తో కాలువలోని వ్యర్థాలను పరిశుభ్రపరచండి

0

విజయవాడ నగరపాలక సంస్థ
29-07-2025

డ్రోన్ సర్వేలన్స్ తో కాలువలోని వ్యర్థాలను పరిశుభ్రపరచండి

విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు

డ్రోన్ సర్వేలన్స్ తో కాలువలోని వ్యర్థాలను పరిశుభ్రపరచండి అని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం అన్నారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా సత్యనారాయణపురం, బి ఆర్ టి ఎస్ రోడ్, నాగేశ్వరరావు పంతులు రోడ్డు, శివరావు స్ట్రీట్, హెచ్ బి కాలనీ, ప్రియదర్శిని కాలనీ, క్రాంబే రోడ్డు ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బందర్, రైవస్, ఏలూరు, బుడమేరు కాలువలో పేరుకుపోయిన వ్యర్థలను డ్రోన్లతో సర్వేలను చేయించి గుర్రపుడెక్కలతో, వ్యర్ధాలతో నిండి ఉన్న చోట పరిశుభ్రపరచి, కాలువలో నీటి ప్రవాహం ఎక్కడ ఆగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరగాలని, ఇంటింటికి వ్యర్థల సేకరణ కచ్చితంగా జరగాలని, వర్షాకాలం దృశ్య నగరంలో దోమల వలన వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు
యాంటీ లార్వే ఆపరేషన్లు కచ్చితంగా నిర్వహించాలని అన్నారు.

తదుపరి హెచ్ బి కాలనీలో గల అన్న క్యాంటీన్ ను పరిశీలించి, పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని అన్న క్యాంటీన్లో నుండి వచ్చే వ్యర్ధాల నిర్వహణ సక్రమంగా చేయాలని, త్రాగునీటి, వాడుకనీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని, ఆహారంలో నాణ్యత సమయపాలన కచ్చితంగా ఉండాలని, నోడల్ ఆఫీసర్లు నిత్యం పర్యవేక్షిస్తుండాలని అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, సిబ్బంది పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version