కింజరాపు కుటుంబంలో పెళ్లి సందడి

0

కింజరాపు కుటుంబంలో పెళ్లి సందడి

నూతన వధూవరులను ఆశీర్వదించిన రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు, శ్రీకాకుళం జిల్లా వాసులు

శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాళి మండలానికి చెందిన నిమ్మాడ గ్రామం మరోసారి ఉత్సాహానికి, ఆనందానికి వేదికైంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోదరులు కింజరాపు ప్రభాకర్ పెద్ద కుమారుడు అశోక్ మరియు శ్యామల ప్రణవి ల వివాహం శుక్రవారం తెల్లవారుజామున వైభవంగా జరిగింది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలోని రాజకీయ, పారిశ్రామిక, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు, కుటుంబ స్నేహితులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

వివాహ వేడుకలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు , రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబ సమేతంగా హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, అభిమానులు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

పెళ్లి పందిరి సందడి, సాంప్రదాయ సంగీతం, మంగళ వాయిద్యాల మధ్య ఘనంగా సాగిన ఈ వేడుక అన్ని వర్గాల ప్రజలను ఒక్కచోట చేర్చింది. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న అశోక్ – ప్రణవి దంపతులకు భవిష్యత్తులో ఆనందం, ఐశ్వర్యం, ఆయురారోగ్యాలు కలగాలని అందరూ ఆకాంక్షించారు.
సంప్రదాయాల పరిరక్షణతో పాటు ఆధునికతకు ప్రాధాన్యతనిచ్చిన ఈ పెళ్లి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.

శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు
శాసనసభ్యులు…
బి. జగదీశ్వరి
పంచకర్ల రమేష్
బండారు సత్యనారాయణమూర్తి
లలిత కుమారి
పల్లా శ్రీనివాస్
గణబాబు
నమ్మక జయ కృష్ణ
లోకం మాధవి
విష్ణు కుమార్ రాజు

శాసనమండలి సభ్యులు
గాదె శ్రీనివాస నాయుడు
వేపాడ చిరంజీవి

పీఎసీఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్

తదితరులు నూతన వధూవరులను ఆశీర్వదించారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version