క్యాపిటాల్యాండ్ సిఇఓ సంజీవ్ దాస్ గుప్తాతో మంత్రి లోకేష్ భేటీ

0

LN Singapore tour – Day – 4

క్యాపిటాల్యాండ్ సిఇఓ సంజీవ్ దాస్ గుప్తాతో మంత్రి లోకేష్ భేటీ

రూ.400కోట్లతో ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ పార్క్‌ ఏర్పాటుకు సుముఖత

సింగపూర్: క్యాపిటాల్యాండ్ ఇన్వెస్టిమెంట్స్ (CLI) సిఇఓ సంజీవ్ దాస్ గుప్తాతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. CLI స్థిరమైన పెట్టుబడులకు ప్రాధాన్యతనిస్తున్నందున విశాఖలోని డేటా సెంటర్‌లను వారి క్యాప్టివ్ పవర్ ప్లాంట్ల ద్వారా పునరుత్పాదక శక్తితో పూర్తిగా శక్తివంతం చేయవచ్చని చెప్పారు. సాంప్రదాయ సాఫ్ట్‌వేర్ కంపెనీలు వైజాగ్ వంటి టైర్ 2 నగరాలకు తరలివస్తున్న నేపథ్యంలో వైజాగ్, విజయవాడలో IT/సాఫ్ట్‌వేర్ పార్కులు, మిశ్రమ అభివృద్ధి నమూనాల ఏర్పాటును పరిశీలించాలని సూచించారు. రాష్ట్రంలోని కీలకమైన పారిశ్రామిక కారిడార్‌లలో పారిశ్రామిక గిడ్డంగులు / పారిశ్రామిక పార్కుల ఏర్పాటు చేయాలని కోరారు. క్యాపిటా ల్యాండ్ సిఇఓ సంజీవ్ దాస్ గుప్తా స్పందిస్తూ… ధీషన్ గ్లోబల్ స్పేసెస్‌తో కలిసి పనిచేస్తున్న క్యాపిటాలాండ్… శ్రీ సిటీ సమీపంలో 400 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ పార్క్‌ను స్థాపించాలని భావిస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా దాదాపు 5వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అన్నారు. జి.ఓ.ఎం.ఎస్.నం. 39, తేదీ. 25-03-2025లో పేర్కొన్న ప్రతిపాదిత భూసేకరణ నుండి మొత్తం 110 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తమ భూమిని మినహాయించాలని కోరారు. APIIC ద్వారా శ్రీసిటీకి కేటాయింపు కోసం కొల్లాడం గ్రామంలో భూసేకరణకు ఇచ్చిన ప్రకటనలో సర్వే నంబర్లు 3 నుండి 153 వరకు తమ సంస్థ భూములు ఉన్నాయని తెలిపారు. ఎపిఐఐసి అధికారులతో మాట్లాడి క్యాపిటాల్యాండ్ సమస్యను పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version