ఉపాధ్యక్షులు గొర్తి శ్రీనివాస చక్రవర్తి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగినది…

0

 19-11-2024

60 డివిజన్ వాంబే కాలనీ

ధి:-19-11-2024 మంగళవారం ఈరోజు ఉదయం 9:00″గం లకు”సెంట్రల్ నియోజకవర్గంలోని 60వ డివిజన్ వాంబే కాలనీ విక్రాంత్ పబ్లిషర్స్ నందు ఎన్.టి.ఆర్. జిల్లా టి.డి.పి. ఉపాధ్యక్షులు గొర్తి శ్రీనివాస చక్రవర్తి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగినది…

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా:- సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు తనయులు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, బొండా సిద్ధార్థ స్వామి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బొండా సిద్ధార్థ స్వామి మాట్లాడుతూ:-తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024-26 విజయవంతంగా నడుస్తోంది అని, కొత్త సభ్యత్వాల నమోదుతో పాటు మీ పాత సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోడానికి కూడా ఇదే సరైన సమయం అని

తెలుగుదేశం పార్టీ సభ్యత్వం 100 రూపాయలు చెల్లించి తీసుకుంటే 5 లక్షల ప్రమాద బీమా, పిల్లల చదువుకి ఆర్థిక సాయం, నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు వంటి ప్రయోజనాలు కల్పింస్తున్నాం అని…

పార్టీ కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా భావించి, వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నఏకైక పార్టీ  తెలుగుదేశం పార్టీ, అందుకే దేశంలో ఏ పార్టీకి లేనంత అభిమానబలం తెలుగుదేశానికే ఉంది అని..

తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024కి అద్భుతమైన స్పందన లభిస్తోంది 24 రోజుల్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకున్నవారు, కొత్తగా తీసుకున్నవారు కలిపి 35 లక్షల మందికి చేరారు అని…

సెంట్రల్ నియోజకవర్గంలో  70 వేలకు పైగా పార్టీ సభ్యత్వాలను నమోదు చేపించి రికార్డు సాధిస్తామని,

ప్రతి రెండేళ్ళకు ఒకసారి నిర్వహించే తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చురుగ్గా పాల్గొంటూ ప్రతి డివిజన్లో ప్రతిరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేస్తున్నారని సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటికే 25 వేలకు పైగా కొత్త సభ్యత్వాలు నమోదు చేసుకున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు..

ఈ కార్యక్రమంలో:-సెంట్రల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ, దాసరి దుర్గారావు, ఆకుల సూర్యప్రకాష్, చిన్నా,శ్రీను,దుర్గ, సుబ్రమణ్యం, ఫణి కుమార్, తదితరులు పాల్గొన్నారు….

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version