విజయవాడలో సోలార్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ను ప్రారంభించిన ఫ్రేయర్ ఎనర్జీ
సౌర విద్యుత్ పట్ల అవగాహనను పెంచడం మరియు రూప్టాప్ సోలార్ను స్వీకరింప జేసేలా చేయటం లక్ష్యంగా పెట్టుకుని ఫ్రేయర్ ఎనర్జీ తమ మూడవ అత్యాధునిక అనుభవ కేంద్రాన్ని ప్రారంభించింది.
విజయవాడ, ఆంధ్రప్రదేశ్ నవంబర్ 21, 2024 భారతదేశంలోని ప్రముఖ సోలార్ కంపెనీ ఫ్రేయర్ ఎనర్జీ, విజయవాడలో తమ సోలార్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభించింది, ఇది సంస్థకు మూడవ ఎక్స్ పీరియన్స్ సెంటర్గా నిలుస్తుంది. ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్ బిజిలీ యోజన కింద సౌర విద్యుత్ స్వీకరణ (సోలార్ అడాప్షన్)లో ఉన్న భారీ అంతరాన్ని పరిష్కరించేందుకు ఈ తరహా కేంద్రాలు ఏర్పాటు ఇప్పుడు తక్షణ అవసరం. ఒక కోటి కుటుంబాలను చేరుకోవాలనే లక్ష్యంలో ఇప్పటివరకు కేవలం 4 లక్షల గృహాలు మాత్రమే సబ్సిడీలను అందుకున్నాయి. పలు నగరాల్లో భౌతిక కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా, సౌర విద్యుత్ స్వీకరించడాన్ని వేగవంతం చేయడానికి బ్రాండ్ను వినియోగదారులకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఫ్రేయర్ ఎనర్జీ ప్రయత్నిస్తుంది.
ప్యానెల్లు, ఇన్వర్టర్లు మరియు ఇతర పరికరాల వంటి కీలకమైన సౌర విద్యుత్ విడి భాగాల పట్ల వ్యక్తిగత చర్చల ద్వారా సౌర విద్యుత్ స్వీకరణ గురించి అవగాహన కల్పించేలా ఫ్రేయర్ ఎనర్జీ యొక్క సోలార్ ఎక్స్ పీరియన్స్ సెంటర్లు రూపొందించబడ్డాయి. ఇవి సిస్టమ్ నాణ్యత మరియు సామర్థ్యం గురించి కస్టమర్లకు అవగాహన కల్పిస్తాయి. సౌర విద్యుత్ వ్యవస్థ అనేది 25 సంవత్సరాలకు పైగా కొనసాగే నిబద్ధత, దీనికి అమ్మకాల తర్వాత విశ్వసనీయమైన మద్దతు అవసరం. విజయవాడలో ప్రారంభించినటువంటి తరహా భౌతిక కేంద్రాలతో, ఫ్రేయర్ ఎనర్జీ మరింత విశ్వసనీయమైన బ్రాండ్ కార్యకలాపాలను నిర్మిస్తుంది, దాని వినియోగదారులకు ప్రత్యక్ష చర్చలు జరిపే అవకాశంతో పాటుగా సమగ్ర మద్దతును అందిస్తుంది. ఫ్రేయర్ ఎనర్జీ యాప్ వంటి ఆవిష్కరణలతో, ఈ అనుభవ కేంద్రాలు తక్షణ కోట్లు, నిజ-సమయ ట్రాకింగ్ మరియు సౌకర్యవంతమైన ఫైనాన్సింగ్ అవకాశాల కోసం సమగ్ర వేదికను అందిస్తాయి. ముందస్తు ఖర్చు భారాన్ని తగ్గించడానికి మరియు సౌర విద్యుత్ శక్తిని మరింత సరసమైనదిగా చేయడానికి, ఫ్రేయర్ ఎనర్జీ ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ పరిష్కారాలను అందిస్తుంది, ఇందులో జీరో-కాస్ట్ ఈఎంఐ ఎంపికలు మరియు ఐదు నిమిషాల్లో ఆమోదించబడిన కొలేటరల్ -ఫ్రీ లోన్లు ఉన్నాయి. ఈ సమగ్రమైన విధానం వినియోగదారులు సౌర విద్యుత్ దిశగా సులభంగా మరియు విశ్వాసంతో మారగలరని నిర్ధారిస్తుంది.
“ఈ అనుభవ కేంద్రాల ద్వారా వినియోగదారులకు అధిక-నాణ్యతతో కూడిన అనుభవాన్ని అందించడంలో అగ్రగామిగా ఉన్నందుకు మేము గర్విస్తున్నాము, త్వరలో భారతదేశం అంతటా ఈ తరహా కేంద్రాలను తెరవడానికి ప్రణాళిక చేసాము. ఇది సౌర విద్యుత్ పరిశ్రమ యొక్క ప్రమాణాలను పెంచడమే కాకుండా వేగంగా సౌర విద్యుత్ శక్తిని స్వీకరించడంలో సహాయపడుతుంది” అని ఫ్రేయర్ ఎనర్జీ యొక్క సహ వ్యవస్థాపకురాలు మరియు డైరెక్టర్ అయిన రాధికా చౌదరి అన్నారు
ఆమె మాట్లాడుతూ, “మా కస్టమర్ల లు సమయానికి, కొన్నిసార్లు షెడ్యూల్ కంటే ముందే కూడా రాయితీలు పొందేలా, స్థానిక మరియు కేంద్ర నోడల్ ఏజెన్సీలతో అవసరమైన ఎంప్యానెల్మెంట్ సమగ్ర పరిష్కారాల ప్రదాతగా మేము గర్విస్తున్నాము. ఫ్రేయర్ ఎనర్జీ వద్ద, మేము 3-4 సంవత్సరాలలోపు తిరిగి చెల్లించేటట్లు చేయడంలో వినియోగదారులకు సహాయం చేస్తూ అగ్రశ్రేణి నాణ్యతా ప్రమాణాలను నిర్వహిస్తాము. భారతదేశం నికర సున్నా ఉద్గారాల దిశగా వెళ్తున్నందున సౌర విద్యుత్ స్వీకరణ వేగవంతం చేసేందుకు మార్గం వేయడం లక్ష్యంగా చేసుకున్నాము” అని అన్నారు.
ఫ్రేయర్ ఎనర్జీ మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ మర్దా మాట్లాడుతూ, “పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మరియు కొనసాగుతున్న వేడి గాలులతో విద్యుత్ వినియోగం పెరుగుతుంది. సౌర విద్యుత్ అవసరం గతంలో. కంటే ఎక్కువగా ఉంది. సౌర విద్యుత్ బిల్లులను తగ్గించడమే కాకుండా గ్రిడ్ పై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది, ఇది పర్యావరణ పరిరక్షణ దిశగా ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలుస్తుంది. సౌర విద్యుత్ రంగంలో నిరంతర ఆవిష్కరణలను తీసుకురావడంపై ఫ్రెయర్ ఎనర్జీ దృష్టి పెడుతుంది, తద్వారా భారతదేశంలోని చిన్న నగరాలలో కూడా సౌర విద్యుత్ అవకాశాలను ఒడిసిపట్టటానికి తగిన అవకాశాలను కల్పిస్తుంది ” అని అన్నారు.
“సోలార్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాలుపంచుకోవటం ఒక గౌరవంగా భావిస్తున్నాను” అని సింగపూర్లోని ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇంపాక్ట్ ఇన్వెస్టింగ్ ఆసియా డైరెక్టర్ శ్రీమతి లెస్లీ జాంబెల్లి అన్నారు. ఆమె మాట్లాడుతూ “ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం స్వచ్ఛమైన, పర్యావరణ అనుకూల శక్తిని ప్రోత్సహించడంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. హరిత, మరింత స్వావలంబనతో కూడిన భవిష్యత్తు కోసం సౌరవిద్యుత్ శక్తిని స్వీకరించడానికి వ్యక్తులు మరియు వ్యాపారాలు రెండింటినీ శక్తివంతం చేస్తుంది. సస్టైనబిలిటీ వైపు ప్రయాణంలో చేరేందుకు ఈ కేంద్రం చాలా మందికి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను. ఇది పునరుత్పాదక శక్తిని అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో కీలకమైన ముందడుగును సూచిస్తుంది, భారతదేశ పర్యావరణ అనుకూల అభివృద్ధి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో, ఇంధన స్వాతంత్ర్యాన్ని ప్రోత్సహించడంలో మరియు రాబోయే తరాలకు పచ్చని భవిష్యత్తును నిర్మించడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయి..” అని అన్నారు.
About Freyr Energy
Freyr Energy is Indur’s leading rooftop solar company that helps homes and busmesses transition to solar energy. We have digitized the entire customer jourmey from exploring to owning a solar system through our proprietary Freyr Energy App. We make a hassle-free experience for the customer by managing the entire process of designing, procuring, and installing rooftop solar systeris using the highest quality standards for the most optimal system performance.