వైసిపి అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ కామెంట్స్ కూటమి ప్రభుత్వం సంపద సృష్టి మొదలైంది. నాయకులకు,

0

 కూటమి ప్రభుత్వం సంపద సృష్టి మొదలైంది. నాయకులకు,

క్యాడర్ కి రాష్ట్ర సంపదను, ప్రజల ఆరోగ్యాన్ని పంచిపెట్టడానికి కుటుంబ ప్రభుత్వం సిద్ధమైంది.

ఈ సంపద దృష్టిలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సితార సెంటర్ నుండి గొల్లపూడి కమర్షియల్ కాంప్లెక్స్ పప్పుల బజార్ వరకు కిరాణా షాపులతో సమానంగా 12 మద్యం షాపులు మరియు బార్లు వెలిసాయి.

పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఎలాగూ వారానికోసారొచ్చి పోతుంటారు కనుక ఈ నియోజకవర్గ ప్రజలు ఏమైపోయినా వారి జీవితాలు ఏమైపోయినా ఇదేమి ఆయన సొంత నియోజకవర్గం కాదు కాబట్టి సాధ్యమైనంత వరకు ఎంత సంపాదించగలమనే దృష్టి పెట్టారు

ఈ మద్యం షాపుల సంపదలో భాగంగా నిబంధనలు గాల్లో కలిపేశారు. 

విద్యాసంస్థలకు 100 మీటర్ల దూరంలోనే ఉండాలన్న నిబంధన గాలికి ఎగిరిపోయింది, దేవాలయాలకు వంద మీటర్ల దూరంలో ఉండాలన్న నిబంధన గాలి ఎగిరిపోయింది, 20వేల జనాభా కి ఒక వైన్ షాపు ఉండాలి అన్న నిబంధన అది గాలికి ఎగిరిపోయింది, జాతీయ రహదారికి 500 మీటర్ల దూరంలో ఉండాలన్న నిబంధన కూడా గాల్లో కలిసిపోయింది.

ఈ వైన్ షాపులకి సమీపంలో ప్రముఖ వ్యాపార వాణిజ్య సముదాయం పప్పుల బజారు కాలేజీలు స్కూలు ప్రముఖ వ్యాపార సంస్థలు ఉన్నాయి వీటిలో ప్రధానంగా ఐరన్యార్డ్ పప్పుల బజార్ చైతన్య పబ్లిక్ స్కూల్ నారాయణ కాలేజ్ ఇలాంటి సంస్థలు ఉన్నాయి అలాగే దేవాలయాలు కూడా ఉన్నాయి మరి నిబంధనలను పాటించకుండా యదేచ్ఛగా ఈ బార్లు బ్రాందీ షాపుల అనుమతులు ఏ విధంగా మంజూరు చేశారు.

ఈ మద్యం సంపదృష్టిలో భాగంగా నియోజకవర్గంలో పార్కులు బారులయ్యాయి మొత్తం 12 బార్లు మరియు వైన్ షాపులతో సితార సెంటర్ నుండి పప్పుల బజార్ వరకు మందు ఏరులై పారుతుంది

 అవకాశం వచ్చింది అధికారం వచ్చింది నాలుగు రాళ్లు వెనకేసుకుందాం అనుకుంటున్నారు. 20, 30 చోటా మోటా నాయకులు పార్టీలు మారుకుంటూ వ్యాపారాలను కాపాడుకుంటూ ప్రజలను లూటీ చేస్తున్నారు

మతాన్ని కులాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల రక్తాన్ని పీల్చిపి చేసే నాయకులను రాజకీయాలకు దూరంగా పెట్టాలి. మన మతమే, మన కులమే అనుకుంటే నాశనమయ్యేది మనమే అని గుర్తుంచుకోవాలి.

పోతిన వెంకట మహేష్

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version