
వైఎస్సార్సీపీలోకి చేరికలు
స్థానిక బ్రాహ్మణ వీధిలోని వైసిపి విజయవాడ పశ్చిమ కార్యాలయంలో శనివారం నాడు 55వ డివిజన్ భారతీయ జనతా పార్టీ, తెలుగు దేశం పార్టీకి చెందిన పలువురు మహిళ నాయకురాలు వైసిపి లో చేరారు. మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సమక్షంలో మంతి వసుంధర, అస్మతున్నీసా, షేక్ ఫర్జానా, షేక్ ఖాజాబి, షేక్ ముంతాజ్, కె నలిని వైఎస్సార్సీపీ లో చేరారు . వారికి వెలంపల్లి శ్రీనివాసరావు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ 55వ డివిజన్ లో కూటమి పార్టీ లు భారతీయ జనతా పార్టీ, తెలుగు దేశం పార్టీ నుంచి వైసిపిలో చేరడం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ పట్ల ఉన్న ఆదరణకు, కూటమి ప్రభుత్వ వైఫల్యం వ్యతిరేకతకు నిదర్శనమని తెలుస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో వైసిపి ఘన విజయం సాధిస్తుందన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తనూ కుటుంబ సభ్యుడిగా చూసుకుంటామని, డివిజన్ అభివృద్ధికి అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం. అని జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఫ్యాన్ గుర్తు పై ఓటేసి విజయవాడ నగర మేయర్ అభ్యర్థి గా పోటీ చేయుచున్న రాయన భాగ్యలక్ష్మి ని, 55వ డివిజన్ కార్పొరేటర్ వైసిపి అభ్యర్థిగా పోటీ చేయుచున్న షేక్ హస్సన్ బాషా బాషిని అత్యధిక మెజారిటీ తో గెలిపించవలసినదిగా విజ్ఞప్తి చేసారు…
![]()
