శుక్రవారం మహా శివరాత్రి సందర్భంగా ‘శివ శక్తి’ గా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటిస్తున్న ‘ఓదెల 2’ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం వారణాసిలో షూటింగ్ జరుపుకుంటోంది. ఆ సమయంలో తీసిన కొన్ని ఫొటోలను ఇటీవల దర్శకుడు సంపత్ నంది ఎక్స్ (ఇంతకుముందు ట్విటర్) వేదికగా పంచుకున్నారు. ఇక 2022 వచ్చిన సూపర్‌హిట్ ఓటీటీ చిత్రం ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్ అయిన ‘ఓదెల 2’ రాబోతోందని ఇటీవలే మూవీ యూనిట్ ప్రకటించింది కూడా.
ఇక ఈ చిత్రంలో ‘శివ శక్తి’ పాత్ర కోసం తమన్నా తనను తాను పూర్తిగా మార్చుకుందనే చెప్పాలి. సాధువులా వేషం, ఒక చేతిలో కర్ర, మరో చేతిలో ఢమరుకం, నుదుటిపై పసుపు బొట్టు, దానిపై కుంకుమ బిందువుతో తమన్నా అచ్చం శివ శక్తిలానే కనిపిస్తుంది. కాశీ ఘాట్లలో ఆమె కళ్ళు మూసుకుని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తాజాగా విడుదలైన పోస్టర్ ఉంది. కాగా, శివ శక్తి పాత్రలో నాగ సాధువుగా తమన్నా కనిపించనున్నారు. ఇప్పటి వరకు కనిపించినట్లుగా గ్లామర్‌గా ఈ చిత్రంలో కనిపించే అవకాశం లేదు. దర్శకుడు సంపత్ నంది ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అశోక్ తేజ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.
Spread the love పశ్చిమ అభివృద్ధికి పెద్దపీట అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి.. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద పీఠ వేస్తున్నట్లు ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. అభివృద్ధి పనుల్లో […]
Spread the loveన్యూ జీజీహెచ్ లో వున్న సమస్యలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తాం..ప్రతి నెల జిల్లా ఎమ్మెల్యేలతో సమావేశాలు పెట్టుకుని హాస్పిటల్ అభివృద్ధికి కృషి చేస్తాంసూపరింటెండెంట్ ఎ .వెంకటేశ్వరరావు, పలు విభాగాల […]
Spread the love ప్రతిక్షణం ప్రజల కోసం ప్రతి అడుగు పెనమలూరు నియోజకవర్గం అభివృద్ధి వైపు ఆదిత్య హృదయం ప్రతినిధిమం తెన గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న జోగి రమేష్ కంకిపాడుఈ రోజు(30/04)న మండలంలోని […]