మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో మహారాష్ట్ర పోర్టులు, మత్స్యశాఖ మంత్రి నితేష్ రాణే భేటీ

Spread the love

మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో మహారాష్ట్ర పోర్టులు, మత్స్యశాఖ మంత్రి నితేష్ రాణే భేటీ

• ఆంధ్రప్రదేశ్ లో పోర్టుల అభివృద్ధి, పురోగతిపై ఇరువురు మంత్రులు విస్తృత చర్చ

• సచివాలయంలోని ఆర్‌ & బి, ఐ & ఐ శాఖ కార్యాలయానికి విచ్చేసిన నితేష్ రాణే

• ఆత్మీయ స్వాగతం పలికిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మారిటైమ్ బోర్డు సీఈవో ప్రవీణ్ ఆదిత్య, సీఈ రాఘవరావు, ఇతర ఉన్నతాధికారులు

• గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ లాండింగ్ సెంటర్లు, PPP విధానం, నూతన మారిటైమ్ పాలసీపై మహారాష్ట్ర ప్రతినిధి బృందానికి ఏపీ అధికారుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్

• దేశంలోనే ప్రత్యేకంగా ఏపీ ప్రభుత్వం ల్యాండ్ లార్డ్ మోడల్‌లో 3 గ్రీన్‌ఫీల్డ్ పోర్టుల అభివృద్ధిపై మంత్రి నితేష్ రాణే ప్రశంసలు

• ప్రభుత్వం పోర్టుల్లో మౌలిక వసతులు కల్పించి, ప్రైవేట్ సంస్థలకు ఆపరేషన్లు అప్పగించే ఏపీ విధానం ఇతర రాష్ట్రాలకు ఆదర్శమన్న నితేష్ రాణే

• ఒక్కో గ్రీన్‌ఫీల్డ్ పోర్టుకు సుమారు రూ.4,500 కోట్ల పెట్టుబడితో 2027 నాటికి పోర్టుల నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యమన్న మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి

• తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ వంటి సముద్రతీరం లేని రాష్ట్రాల ఎగుమతులు, దిగుమతులకు ఏపీ పోర్టులు కీలకంగా మారతాయన్న మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి

• దుగరాజపట్నం, మచిలీపట్నంలో షిప్‌బిల్డింగ్ అభివృద్ధి.. కాకినాడలో షిప్‌బిల్డింగ్ ప్రతిపాదన పురోగతిలో ఉందన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

• మత్స్యకారుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ.. మారిటైమ్ బోర్డు ఆధ్వర్యంలో ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధి విధానంపై మహారాష్ట్ర మంత్రి ఆసక్తి

• విజయవాడ–అమరావతి వాటర్ మెట్రోకు అనుమతులు – సీప్లేన్ సేవల కోసం 9 ప్రాంతాల గుర్తింపు, శ్రీశైలం–విజయవాడ మధ్య ట్రయల్ రన్ వంటి అంశాలను వివరించిన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి

• రాయలసీమ నుంచి హార్టికల్చర్ ఉత్పత్తుల ఎగుమతులకు మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కులు నిర్మిస్తున్నామన్న మారిటైమ్ బోర్డు అధికారులు

• తీరప్రాంతంలోని 20 వేల ఎకరాల ఉప్పు భూములతో ల్యాండ్ బ్యాంక్ కోసం కేంద్రానికి ప్రతిపాదన పంపినట్లు తెలిపిన అధికారులు

• ఏపీలోపోర్టులు, రైల్వేలు, జాతీయ రహదారుల పనుల వేగవంతానికి మంత్రి నేతృత్వంలో ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్ కమిటీపై మహారాష్ట్ర మంత్రి ప్రశంసలు

• మారిటైమ్, షిప్‌బిల్డింగ్, ఫిషింగ్ హార్బర్లలో యువతకు నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యత కల్పిస్తున్నామన్న ఏపీ మారిటైమ్ బోర్డు

• ఈ సమావేశంలో పాల్గొన్న మహారాష్ట్ర మారిటైమ్ బోర్డ్ సీఈఓ ప్రదీప్.పి, సీపీఓ కెప్టెన్ ప్రవీణ్ ఖారా, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మనీష్ మెట్కర్ తదితరులు

Loading