ప్రధాని మోదీకి సంఘీభావంగా పశ్చిమ లో సేవా జ్యోతి యాత్ర

Spread the love

ప్రధాని మోదీకి సంఘీభావంగా పశ్చిమ లో సేవా జ్యోతి యాత్ర

ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకొని “సేవా సంకల్ప్ అభియాన్” లో భాగంగా కొత్తపేట కేబీఎన్ కళాశాల నుంచి భవానిపురం ఎన్డీయే కార్యాలయం వరకు సేవా జ్యోతి యాత్ర నిర్వహించారు.

బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షుడు గోటిక శివకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన “సేవా జ్యోతి యాత్రలో” వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ , ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్,మిజోరాం మాజీ గవర్నర్ కొమరం రాజశేఖర్,టీడీపీ పశ్చిమ ఇన్చార్జ్ బుద్ధా వెంకన్న, బీజేపీ స్టేట్ ప్రోటోకాల్ ఇన్చార్జ్ పాతూరి నాగ భూషణం, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ బాజీ, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షుడు సయ్యద్ భాష, యువమోర్చా ఇన్చార్జ్ హరికృష్ణ , యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి నాగిరెడ్డి మాజీ కార్పొరేటర్లు బీజేపీ నేతలు పలు కళాశాల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు..

Loading