ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైనఎల్ ఓ సీ పత్రాలను పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ఎన్డీయే కూటమి నేతలతో కలిసి బాధితుల కుటుంబ సభ్యులకు అందజేశారు

Spread the love

మెరుగైన వైద్యం కోసం
ఎల్ ఓ సీ పత్రాలు అందజేత

ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన
ఎల్ ఓ సీ పత్రాలను పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ఎన్డీయే కూటమి నేతలతో కలిసి బాధితుల కుటుంబ సభ్యులకు అందజేశారు.

వించి పేటకు చెందిన భూపతి రాజేష్ (18) టీబీ చికిత్సకు రూ 6.81 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు.

ఖుద్దూస్ నగర్ కు చెందిన జీ భవాని శంకర్ (31) బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతూ వైద్య సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ 6.70 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు..

కొత్తపేటకు చెందిన డోకుపర్తి ధనలక్ష్మి (47) మోకిళ్ళ శస్త్ర చికిత్స కోసం
రూ 5.33 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు.

కే ఎల్ రావు నగర్ కు చెందిన ఈదులూరి రాధా కృష్ణ (56) బ్రెయిన్ స్ట్రోక్ కు గురై అత్యవసర వైద్య సాయం కోసం రూ 1.30 లక్షల విలువైన ఎల్ ఓ సీ ను అందజేశారు.

త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ లను అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు బాధితుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

కూటమి నాయకులు బుల్లా విజయ్ కుమార్, కామ దేవరాజ్, ఏలూరి సాయి శరత్, విశ్వేశ్వరరావు, పచ్చవ మల్లికార్జునరావు, మైనంపాటి రమేష్, బొర్రా భాను శ్రీరామ్, షేక్ హబీబ్, బుదాల నంద కుమారి, పితాని పద్మ తదితరులు పాల్గొన్నారు..

Loading