తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు.. సాయి సంజయ్ ఆధ్వర్యంలో 300 మంది టీడీపీలో చేరిక

Spread the love

తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు.. సాయి సంజయ్ ఆధ్వర్యంలో 300 మంది టీడీపీలో చేరిక

చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం.. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి – ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు

ధి :-8-10-2026 ఈరోజు గురువారం ఉదయం 12:15″గం లకు” పాయకపురం MSR కన్వెన్షన్ హాల్ నందు వ్యాపారవేత్త సాయి. సంజయ్ వారి అనుచరులు 300 మంది తో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండా సిద్ధార్థ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగినది…

ఈ సందర్భంగా సాయి సంజయ్ ఆయన అనుచరులకు ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు,తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి నూతనంగా చేరిన ప్రతి ఒక్కరినీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని బొండా ఉమా తెలిపారు.

ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ:- తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంపై విశ్వాసంతో సాయి సంజయ్ ఆధ్వర్యంలో సుమారు 300 మంది పార్టీలో చేరడం సంతోషకరమన్నారు, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ టీడీపీ కుటుంబంలో భాగస్వాములేనని, అందరినీ కలుపుకుని పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.

ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయడం ప్రతి పార్టీ కార్యకర్త బాధ్యత అని, ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య పార్టీ నాయకులు, కార్యకర్తలు వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

పార్టీలో నూతనంగా చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం, గుర్తింపు కల్పిస్తూ పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తామని, నియోజకవర్గం లో NDA కూటమి కార్యక్రమాలను మరింత విస్తృతం చేసి, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నూతన సభ్యులకు పిలుపునిచ్చారు…

తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలియజేసారు…

ఈ కార్యక్రమంలో:- ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్స్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్, TNTUC రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘురామరాజు, సెంట్రల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, రాష్ట్ర కార్యనిర్వాహణ కార్యదర్శి దాసరి ఉదయశ్రీ, సెంట్రల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు పైడితలసి, పైడి శ్రీను, DD నాయుడు, కంచెటి నాగరాజు, సోమన అనిల్, లబ్బా వైకుంఠం, కోలా శ్రీను, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సాయి సంజయ్ అనుచరులు, నూతనంగా పార్టీలో చేరిన 300 మంది తదితరులు పాల్గొన్నారు.

Loading