వైసీపీ ఖేల్ ఖతమ్రా ష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

Spread the love

వైసీపీ ఖేల్ ఖతమ్

  • రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
  • జగన్ పై ప్రజలకే కాదు వైసీపీ శ్రేణులకూ నమ్మకం లేదు
  • స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంతో జగన్ లో తీవ్ర అసహనం
  • ప్రజలను, అధికారులను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యాఖ్యలు
  • వైసీపీ శ్రేణులను రెచ్చగొడుతున్న గొడ్డలి పార్టీ నాయకుడు
  • ‘స్థానికం’లో స్వీప్ చేయబోతున్నాం
  • ట్రిపుల్ సర్కార్ తో అభివృద్ధి, సంక్షేమం పరుగులు : మంత్రి సవిత

పెనుకొండ/శ్రీసత్యసాయి : రాష్ట్రంలో వైసీపీ పని ఖేల్ ఖతమైందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వీప్ చేయబోతున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. జగన్ ను ప్రజలే కాదు చివరికి వైసీపీ శ్రేణులు సైతం నమ్మడం లేదని, అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో గొడ్డలి పార్టీ తరఫున నామినేషన్లు వేయడానికి ఆసక్తి చూపడం లేదని అన్నారు. వైసీపీని 11 సీట్లకే పరిమితం చేసి జగన్ కు గుణపాఠం చెప్పినా, ఆయన తీరు మారడం లేదని మండిపడ్డారు. చొక్కా మడత పెడితే అంటూ ప్రజలను, అధికారులను భయపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికలతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ కూటమి పార్టీలు సత్తా చాటాయన్నారు. 17 మున్సిపాల్టీలను, 77 జెడ్పీటీసీలను కూటమి పార్టీలు ఏకగ్రీవంగా గెలుచుకున్నాయన్నారు. పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల నియోజకవర్గంలో ఏడు జడ్పీటీసీ స్థానాలకుగాను మూడు ఏకగ్రీవంగా గెలుచుకున్నామన్నారు. అదే నియోజక వర్గంలో 65 ఎంపీటీసీ స్థానాలకు 64 ఏకగ్రీవంగా సొంతం చేసుకున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలతో కడప జిల్లా వాసులకు ఫ్యాక్షనిస్టులు, గూండాల నుంచి విముక్తి లభించిందన్నారు. రాష్ట్రంతో పాటు కడపలో అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామన్నారు. కడప సహా రాయలసీమ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కడప, పులివెందులలో తాగునీటి ప్రాజెక్టులు చేపడుతున్నామన్నారు. ట్రిపుల్ సర్కార్ తో అభివృద్ధి, సంక్షేమాన్ని రాష్ట్రంలో పరుగులు పెట్టిస్తామని మంత్రి సవిత తెలిపారు.

జగన్ పై వైసీపీ కేడర్ కు నమ్మకం లేదు…

జగన్ ను ప్రజలే కాదు చివరికి వైసీపీ శ్రేణులు సైతం నమ్మడం లేదని మంత్రి సవిత తెలిపారు. ఆయనెంత ఒత్తిడి తీసుకొచ్చినా స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేయడానికి వైసీపీ శ్రేణులు ముందుకు రావడం లేదన్నారు. దేశ రాజకీయాల్లో నాయకుడిని నమ్మని క్యాడర్ వైసీపీలో మాత్రమే ఉందన్నారు. రాష్ట్రంలో వైసీపీ పని ఖేల్ ఖతం దుకాణం బందయ్యిందన్నారు. మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో వైసీపీ శ్రేణులు పలు చోట్ల నామినేషన్లు వేయకపోవడ వల్లే ఏకగ్రీవాలు జరిగాయన్నారు. ఇది వైసీపీకి, జగన్ కు సిగ్గుచేటని మంత్రి సవిత అన్నారు.

ఓటమి భయంతో జగన్ లో అసహనం

స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో మరో ఘోర ఓటమి ఖాయం కావడంతో జగన్ లో అసహనం పెరిగిపోయిందని మంత్రి సవిత అన్నారు. చొక్కా మడత పెడితే…అంటూ ప్రజలు, అధికారులను భయపెట్టేలా మాట్లాడుతున్నారన్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లోనైనా పార్టీ ఉనికిని కాపాడుకోడానికి కిందా మీదా పడుతున్నారని ఎద్దేవా చేశారు. గతంలో ఇదే మాదిరిగా, సీఎంగా ఉన్నప్పుడు తలపై వెంట్రుక కూడా పీకలేరని రెచ్చగొట్టేలా మాట్లాడారన్నారు. దీంతో ప్రజలు వైసీపీని 11 సీట్లకు పరిమితం చేసి తగిన గుణపాఠం చెప్పారన్నారు. అయినా జగన్ నైజం మారడం లేదన్నారు. గొడ్డలి పార్టీ నాయకుడి మాటలతో రెచ్చిపోతే నష్టపోయేది వారేనని మంత్రి సవిత హితవు పలికారు.

‘స్థానికం’లో స్వీప్ చేయబోతున్నాం

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు స్వీప్ చేయబోతున్నాయని మంత్రి సవిత ధీమా వ్యక్తంచేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా సీఎం చంద్రబాబునాయుడు పాలన సాగిస్తున్నారన్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలుతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్నామన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ పనితీరుపై ప్రజల్లో పూర్తిస్థాయి సంతృప్తి వ్యక్తమవుతోందని, గ్రామాల్లో తమకు బ్రహ్మరథం పడుతున్నారని మంత్రి సవిత తెలిపారు

Loading