65వ డివిజన్‌లో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం ప్రజల ఆదరణతో అభివృద్ధి దిశగా ముందుకు సాగుదాం – యువ నాయకులు బొండా రవితేజ

Spread the love

65వ డివిజన్‌లో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం ప్రజల ఆదరణతో అభివృద్ధి దిశగా ముందుకు సాగుదాం – యువ నాయకులు బొండా రవితేజ

ధి : 24-10-2026 శనివారం సాయంత్రం 5:30 గంటలకు 65వ డివిజన్ మారుతీనగర్ మాగంటి వారి వీధి నుంచి ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి వల్లభనేని రాజేశ్వరి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండా రవితేజ పాల్గొని ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా బొండా రవితేజ మాట్లాడుతూ:- నగర అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన, స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి కృషి చేయడమే ప్రజాప్రతినిధుల ప్రధాన బాధ్యత అని తెలిపారు.

65వ డివిజన్‌లో ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి అవసరాలకు అనుగుణంగా పనిచేయడానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వల్లభనేని రాజేశ్వరి కృషి చేస్తారని తెలిపారు. ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ప్రజల్లోకి వెళ్లి తమ అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎన్డీఏ కూటమి కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Loading