అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఘన సన్మానం..

విజయవాడ పశ్చిమ అక్టోబర్ 8:- పశ్చిమ నియోజకవర్గంలో 46వ డివిజన్ పరిధిలోని బీమనవారి పేట సెక్టార్–2 అంగన్వాడీ కేంద్రాల్లో సేవలందిస్తున్న అంగన్వాడీ టీచర్లు హెల్పర్స్ కు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పౌష్టికాహారం ప్రాథమిక విద్యతో పాటు గర్భిణులు బాలింతలకు అవసరమైన సేవలు అందించడంలో టీచర్లు ఆయాలు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా అభినందించారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు హెల్పర్స్ ను శాలువాలు పుష్పగుచ్ఛాలతో సత్కరించి వారి సేవలను కొనియాడారు. చిన్నారుల ఆరోగ్యం విద్యాభివృద్ధి పోషకాహారం విషయంలో అంగన్వాడీ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు. సమాజంలో అంగన్వాడీ సిబ్బంది అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని అన్నారు.
కార్యక్రమంలో
బీమనవారి పేట సెక్టార్–2 పరిధిలోని అంగన్వాడీ టీచర్లు హెల్పర్స్ సిబ్బంది స్థానికులు తదితరులు పాల్గొన్నారు…
![]()
