
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (APSACS) వారి ఆధ్వర్యంలో 2026 మారథాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. హెచ్ఐవి ఎయిడ్స్ పై యువతతో పాటు ప్రజల అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం అని ప్రాజెక్ట్ డైరెక్టర్ B. స్మరణ రాజ్ IAS తెలియజేశారు.
ముందుగా ఈ కార్యక్రమాన్ని బి.స్మరణ రాజ్ IAS వారి చేతుల మీదుగా బెలూన్స్ ఎగరవేయడంతో ప్రారంభించడం జరిగింది. హెచ్ఐవి తో ఉన్నవారికి సమాజంలో వివక్షత చూడాల్సిన అవసరం లేదని హెచ్ఐవి ఎలా వస్తుంది ఎలా రాదు అనే విషయాలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని ముఖ్యంగా యువతను భాగస్వామ్యం చేయడం ద్వారా యువతను హెచ్ఐవి బారిన పడకుండా సమాజంలో వారి యొక్క రిస్క్ ని తగ్గించాలి అనే ఉద్దేశంతో అందరూ కూడా అవగాహన పెంచుకోవాలని సూచించడం జరిగింది.
ఈ రెడ్ రన్ కార్యక్రమం ప్రతి జిల్లాలో కూడా నిర్వహించడం జరిగింది. అక్కడ గెలుపొందిన మొదటి రెండవ మూడవ వ్యక్తులను ఇక్కడ పాల్గొనడం కి అర్హతగా తీసుకొని ఇక్కడ రాష్ట్రస్థాయి మారథాన్ రెడ్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలియజేశారు రాష్ట్రస్థాయి లో గెలుపొందిన వారిలో మొదటి రెండవ మూడవ బహుమతుల్లో వీరిని రీజనల్ స్థాయి మారథాన్ కి పంపించడం జరుగుతుంది అలాగే నేషనల్ స్థాయి మారథాన్ కి కూడా పంపించడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో 28 జిల్లాల నుండి పాల్గొనడం జరిగింది. పురుషుల విభాగం నుంచి
ప్రథమ బహుమతి M నరేష్ జివిడి డిగ్రీ కాలేజ్ సాలూరు పార్వతీపురం మన్యం జిల్లా,35,000
ద్వితీయ బహుమతి N. నిరంజన్ జివిడి డిగ్రీ కాలేజ్ 25,000పార్వతిపురం మన్యం జిల్లా,
తృతీయ బహుమతి K.మణికంఠ రాజమండ్రి ఆర్ట్స్ డిగ్రీ కాలేజ్ ఈస్ట్ గోదావరి.10.000
మహిళా విభాగం నుంచి
ప్రధమ బహుమతి E. స్వాతి చీరాల బాపట్ల జిల్లా, 35,000
ద్వితీయ బహుమతి B.స్పందన మన్యం గుమ్మలక్ష్యం పురం డిగ్రీ కాలేజ్.25,000
తృతీయ బహుమతి G. గాయత్రి విశాఖపట్నం బి వి కే జూనియర్ కాలేజ్10,000 నుండి గెలుపొందడం జరిగింది.
ముఖ్యంగా ఈ కార్యక్రమంలో Dr .K.భాగ్యలక్ష్మి ఏ పి డి టి Dr T.మంజుల జెడి IEC , డాక్టర్ శ్రీనివాస్ వర్మ జెడి, CST సుకుమార్ జెడి TI Dr భాను నాయక్ DLTO ఎన్టీఆర్ జిల్లా, K. కోటీశ్వరరావు DSDO sports , రమేష్ టూరిజం ఆఫీసర్
Dr రాజేంద్రప్రసాద్ మరియు APSACS సిబ్బంది మరియు స్పోర్ట్స్ సిబ్బంది జిల్లాల నుండి Disha సిబ్బంది పార్ట్నర్ NGOs మరియు TI స్టాప్ పాల్గొనడం జరిగింది.
![]()
