విజయవాడ ఉత్సవ్ 2.0కు జాతీయ అతిథులకు ఆత్మీయ ఆహ్వానం

Spread the love

విజయవాడ ఉత్సవ్ 2.0కు జాతీయ అతిథులకు ఆత్మీయ ఆహ్వానం

దసరా నవరాత్రి వేడుకల్లో భాగస్వాములు కావాలని ఢిల్లీ,పశ్చిమ బెంగాల్ సీఎంలకు,కేంద్ర మంత్రులకు ఆహ్వానం

విజయవాడ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పడమే లక్ష్యం

విజయవాడ(ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ )
విజయవాడలో అత్యంత వైభవంగా నిర్వహించనున్న దేవి శరన్నవరాత్రి దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ 2.0కు దేశంలోని ప్రముఖ ప్రజాప్రతినిధులు, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తున్నారు. శ్రీ కనకదుర్గ అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందడంతో పాటు విజయవాడ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని వీక్షించాలని వారికి ఆత్మీయ ఆహ్వానం అందిస్తున్నారు.

ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, జి. కిషన్ రెడ్డి, డా. పెమ్మసాని చంద్రశేఖర్కు మంత్రి సత్యకుమార్ యాదవ్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఎంపీ హరీష్ బాలయోగి, విజయవాడ ఉత్సవ్ కమిటీ సభ్యులు నరసింహారావు తదితరులు ఆహ్వాన పత్రికలు అందించారు.

అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్వయంగా కలిసి విజయవాడలో నిర్వహించనున్న దసరా నవరాత్రి ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ 2.0లో పాల్గొనాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఉత్సవ్ కమిటీ సభ్యులు ముత్తవరపు మురళి, మణికంఠ పాల్గొన్నారు.

విజయవాడలో నిర్వహించే దసరా నవరాత్రి వేడుకలు కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా, నగర సాంస్కృతిక వైభవాన్ని దేశవ్యాప్తంగా పరిచయం చేసేలా విజయవాడ ఉత్సవ్ 2.0ను మరింత ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

విజయవాడకు ఉన్న చారిత్రక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రత్యేకతలను దేశవ్యాప్తంగా చాటిచెప్పడంతో పాటు, వివిధ రాష్ట్రాల ప్రజలు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రముఖులు ఈ వేడుకల్లో భాగస్వాములు కావాలన్నదే ఉత్సవ్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

శ్రీ కనకదుర్గ అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందేందుకు, విజయవాడ దసరా నవరాత్రి ఉత్సవాల ఆధ్యాత్మిక వైభవాన్ని ఆస్వాదించేందుకు, విజయవాడ ఉత్సవ్ 2.0లో భాగస్వాములు కావాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రముఖులకు నిర్వాహకులు ఆత్మీయ ఆహ్వానం పలికారు.

విజయవాడ ఉత్సవ్‌ను “విజయవాడ ప్రజలందరి ఉత్సవం”గా విజయవంతం చేయడంతో పాటు, నగర ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని జాతీయ స్థాయిలో మరింత బలంగా చాటిచెప్పేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నిర్వాహకులు కోరారు.

Loading