2019లో వలే మరోసారి సహకరించండి. కృష్ణానదిపై 60 కోట్లతో బ్రిడ్జి నిర్మాణంతో పట్టణ వ్యాపార రంగం మరింత అభివృద్ధి.

0


 _*వ్యాపారస్తులకు అండగా ఉంటా*._

2019లో వలే మరోసారి సహకరించండి.  కృష్ణానదిపై 60 కోట్లతో బ్రిడ్జి నిర్మాణంతో పట్టణ వ్యాపార రంగం మరింత అభివృద్ధి. 

_2019 ఎన్నికల్లో తనకు మద్దతిచ్చి విజయానికి కృషి చేసిన జగ్గయ్యపేట పట్టణ వ్యాపారస్తులు మరోసారి తనకు సహకరించాలని ప్రభుత్వవిప్ శాసనసభ్యులు సామినేని ఉదయభాను  కోరారు._

*సోమవారం సాయంత్రం సామినేని ఉదయభాను  యువ నాయకులు వెంకటకృష్ణ ప్రసాద్  పట్టణంలోని పాతపేట గడ్డ, బంగారు కోట్ల సెంటర్, కన్యాకుమారి పాన్ షాప్ కూడలి, నెహ్రూ చౌక్ తదితర మార్గాల్లోని ప్రతి దుకాణానికి వెళ్లి  ఓట్లను అభ్యర్థించారు. వ్యాపారస్తులకు అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనకు, ఎంపీగా కేశినేని నాని కి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా ఉదయభాను  కోరారు*.


అనంతరం ఉదయభాను మాట్లాడుతూ కృష్ణా నదిపై 60 కోట్ల రూపాయలతో నిర్మించే ముక్త్యాల మాదిపాడు బ్రిడ్జి వల్ల జగ్గయ్యపేట పట్టణం వ్యాపార రంగంలో మరింతగా విరాజిల్లుతుందని తెలిపారు. బ్రిడ్జి పూర్తయితే గుంటూరు, పల్నాడు జిల్లాలకు వెళ్లాలంటే  ప్రయాణ భారం బాగా తగ్గుతుందన్నారు. అంతేకాకుండా వ్యాపార రంగం మరింత విస్తృతం అవుతుందని చెప్పారు. మరొకసారి అవకాశం ఇస్తే జగ్గయ్యపేటను ఎన్టీఆర్ జిల్లాలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని అన్నారు. 2019లో వ్యాపారస్తులందరూ తనకు సహకరించారని అదేవిధంగా మే 13న జరిగే ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓట్లను ఫ్యాను గుర్తుపై వేసి మరొకసారి గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version