సొంత ఇంటి కల నిజం చేసే నిజమైన ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు

0

 04-12-2024

 సొంత ఇంటి కల నిజం చేసే నిజమైన ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే

 టిట్కో ఇళ్ల లబ్ధిదారులకు త్వరలోనే టిక్కో ఇల్లు అప్పగిస్తాం

సింగ్ నగర్ ప్రాంత వాసులకు 2వ ఫ్లై ఓవర్ ను నిర్మించి ట్రాఫిక్ సమస్య లేకుండా చూస్తాం

ధి:04-12-2024 బుధవారం సాయంత్రం 5:00″గం లకు” విజయవాడ సింగ్ నగర్ లోని సెంట్రల్  నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు  ప్రధానంగా ఇల్లు లేని నిరుపేదలకు సొంత ఇంటి కలను నిజం చేసేటువంటి విధముగా ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నదని NDA కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిటువంటి హామీలు నెరవేరుస్తుందని.. పేదవాడి సొంత ఇల్లు కట్టుకోవాలని జీవిత కల అని, ఇటువంటి సొంత ఇంటి కలని ఈరోజు కూటమి ప్రభుత్వం నిజం చేయబోతుందని, గత 2014 To 2019లో తెలుగుదేశం ప్రభుత్వంలో తాను శాసనసభ్యులుగా ఉన్న సమయంలో సొంత స్థలం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సాంక్షన్ చేసినటువంటి ₹2.50 లక్షల రూపాయలు BLC స్కీమ్ ద్వారా ఉచితంగా అందజేయడం జరిగినదని..

కనీసం ఒక్క రూపాయి లోన్ కూడా రానటువంటి పరిస్థితులలో ఉన్న పేదవారికి  2 లక్షల 50 వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ డబ్బును ఇచ్చి పేదవారు ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేయడం జరిగినదని…

ఈ సెంట్రల్ నియోజకవర్గంలో కొన్ని వేల ఇల్లు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే కట్టించామని, 2019 లో అధికారంలోకి వచ్చిన ఒక్క ఛాన్స్ వైసిపీ ప్రభుత్వం పేదవారిని దారుణంగా మోసం చేసిందని, ₹15 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఎకరం స్థలాన్ని ₹80 లక్షల రూపాయలకు కొన్నామని చెప్పి ప్రభుత్వ డబ్బును దోచేశారు అని…

ఈరోజు 2024లో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం పేదవాడి చిరకాల సొంత ఇంటిని వారికి అందించే విధంగా  ఉచితంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రెండు లక్షల 50 వేల రూపాయలు అందించి, కొత్త పథకాన్ని అమలు చేయబోతున్నది అని, ఈ పథకం ప్రతి సచివాలయంలో ఆంధ్ర ప్రదేశ్  హౌసింగ్ ఆప్ ద్వారా ఎవరు అయినా సులువుగా సచివాలయ అడ్మిన్ దగ్గరకు వెళ్లి  నమోదు చేసుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసిందని..ఎవరికైతే స్థలం లేక టిట్కో ఇళ్లకు నమోదు చేసుకుంటున్నారో వారికి, అలాగే గతంలో 25వేలు  50వేలు కట్టి ఉన్నారో  వారు కూడా ఇదే యాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే సౌలభ్యం ఉన్నదని, వచ్చినటువంటి దరఖాస్తులను పరిశీలించి వారికి కూడా మార్చి లోపు పనులను ప్రారంభించి 90రోజుల లోపే కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు అందించనున్నదని..అలాగే ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నటువంటి సింగ్ నగర్ ప్రాంత ప్రజలకు కూడా త్వరలోనే ఈ ట్రాఫిక్ కష్టాలను దూరం చేయనున్నామని నిన్ననే ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ని కలిసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యను వారి దృష్టికి తీసుకొని వెళ్లడం జరిగినదని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ (చిన్ని) నియోజకవర్గ శాసనసభ్యులుగా తాను త్వరలోనే రైల్వే మినిస్టర్ను కూడా కలిసి నియోజకవర్గంలో నిర్మించవలసినటువంటి రైల్వే RUB లు గురించి వివరించనున్నామని ఈ సందర్భంగా బొండా ఉమా తెలియజేశారు…

 ఈ విలేకరుల సమావేశంలో:-టిడిపి రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, దాసరి దుర్గారావు (పెప్సీ )పాల్గొన్నారు…

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version