సుజనా ఫౌండేషన్ మెగా వైద్య శిబిరానికి ఏడవ రోజూ అనూహ్య స్పందన

0

 సుజనా ఫౌండేషన్ మెగా వైద్య శిబిరానికి ఏడవ రోజూ అనూహ్య స్పందన 

సుజనా ఫౌండేషన్ షేర్ ఇండియా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 16న పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ప్రారంభించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభిస్తుంది. 30 రోజులపాటు నిరంతరాయంగా కొనసాగనున్న ఉచిత మెగా వైద్య శిబిరాల్లో భాగంగా భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో గురువారం పశ్చిమ ప్రజలు స్థానికులు భారీ సంఖ్యలో హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రోగులు ఈ శిబిరానికి తరలి వస్తున్నారు. ప్రముఖ వైద్య నిపుణులు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ M.S.F.R.C.S.( బ్రిటన్) డాక్టర్ సి ఎల్ వెంకట్రావు ఈ వైద్య శిబిరంలో తమ సేవలను అందిస్తున్నారు. కంటి తుడుపు చర్యగా కాకుండా రోగులకి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేస్తున్నారు. వారం రోజులపాటు జరిగిన వైద్య శిబిరంలో 512 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ముగ్గురు మహిళలకి గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ పాజిటివ్ రాగా , ఇద్దరు పురుషులకి టిబి నిర్ధారణ అయింది. హెల్త్ క్యాంప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బొమ్మ కంటి వెంకటరమణ రోగులకి కౌన్సిలింగ్ నిర్వహించి తగు జాగ్రత్తలు తెలియజేశారు. సెప్టెంబర్ 16 వరకు వైద్య శిబిరాన్ని భవానిపురంలోని ఎన్డీయే కార్యాలయంలోనే నిర్వహించనున్నట్లు సుజనా ఫౌండేషన్ కోఆర్డినేటర్ వీరమాచనేని కిరణ్ తెలిపారు. పశ్చిమ ప్రజలకు మరిన్ని వైద్య పరీక్షలను నిర్వహించి మెరుగైన వైద్యం అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ అవకాశాన్ని పశ్చిమ ప్రజలందరూ ముఖ్యంగా మహిళలందరూ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సుజనా ఫౌండేషన్ సభ్యులు చింతా బాబి,సృజన్, మంతెన తరుణ్, తమ సేవలను అందిస్తున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version