సత్యమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే కృష్ణప్రసాదు, శిరీష అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ.

0

 సత్యమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే కృష్ణప్రసాదు, శిరీష 

అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ.

ఎన్టీఆర్ జిల్లా, 07.10.2024, అంబారుపేట.

నందిగామ మండలంలోని అంబారుపేటలో వేంచేసియున్న శ్రీ సత్యమ్మతల్లి అమ్మవారికి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు, ఆయన సతీమణి శిరీష  సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పట్టువస్త్రాలు సమర్పించారు. దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలను పురస్కరించుకొని ప్రతి ఏడాది అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా శ్రీ సత్యమ్మతల్లి అమ్మవారి దేవస్థానంలో పూజల్లో పాల్గొన్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం శాసనసభ్యులు కృష్ణప్రసాదు దంపతులను ఆహ్వానించారు. అమ్మవారిని దర్శించుకుని, వేదపండితుల శాస్త్రోక్త మంత్రోచ్ఛారణల మధ్య పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు  ఆకాంక్షించారు. కన్నులపండువగా జరిగిన ఈ పూజా కార్యక్రమంలో భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version