ఐదవ రోజు శ్రీ కనకదుర్గ అమ్మవారి అవతారం శ్రీ మహా చండీ దేవి

0

 7-10-2024

ఐదవ రోజు శ్రీ కనకదుర్గ అమ్మవారి అవతారం శ్రీ మహా చండీ దేవి

ధి:-7-10-2024  సోమవారం ఉదయం 6:00″గం లకు” శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీకనకదుర్గమ్మవారు “శ్రీ మహాచండీ దేవి” గా దర్శనమిచ్చిన అమ్మవారిని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర రావు  కుటుంబ సమేతంగా వెళ్లి అమ్మవారిని దర్శించుకుని రాష్ట్ర ప్రజలు నియోజకవర్గ ప్రజలు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకోవడం జరిగినది…

ఈ సందర్భంగా బోండా ఉమా గారు మాట్లాడుతూ:-శ్రీకనకదుర్గమ్మవారు శ్రీ మహాచండీ దేవి గా దర్శనమిస్తారు అని, నేడు అమ్మవారిని ఎర్రటి వస్త్రాలతో, ఆభరణాలతో అలంకరించి సింహ వాహనాన్ని అమరుస్తారు అని, ఈరోజున అమ్మ‌వారు సింహం భుజ‌ముల‌పై భీష‌ణంగా కూర్చొని త‌న ఎనిమిది చేతుల యందు వివిధ ర‌కాల ఆయుధాల‌ను ద‌రించి, రాక్ష‌స సంహారం గావించి లోక క‌ళ్యాణం జ‌రిపించిన దివ్య‌మైన రూపంతో భ‌క్తుల‌కు సాక్షాత్క‌రిస్తుంది …

పంచ‌మి ప‌ర్వ‌దినం రోజున చండీ పారాయ‌ణం, చండీ యాగం చేస్తారు అని,పులగం నైవేద్యం గా సమర్పిస్తారు,ఈ రోజు మహాచండీని భక్తిశ్రద్ధలతో పూజించిన వారికి దైహిక, మానసిక శక్తియుక్తులు, కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు అని…

శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు శ్రీ మహా చండీ దేవి గా దర్శనమిస్తున్న విజయవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులతో రాష్ట్రంలో పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ భక్తులకు మరియు ప్రజలు అందరికీ శ్రీ దేవీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు బొండా ఉమా  మరియు బొండా సుజాత తెలియజేశారు…

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version