శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలో మెగాస్టార్ ఫ్యామిలీ
తిరుపతి :ఆగస్టు 22
మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు తిరు మల శ్రీ వేంకటేశ్వరస్వా మిని దర్శించుకున్నారు.
గురువారం ఉదయం శ్రీవారి మేల్కొలుపు సేవ అయిన సుప్రబాత సేవలతో కుటుంబ సభ్యులతో కలిసి ముక్కులు చెల్లించుకు న్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపం లో వేదపండితులు వేదా శీర్వచనం అందించారు.
ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అంద జేశారు. చిరంజీవిని పట్టు వస్త్రాలతో వేదపండితులు సత్కరించారు. చిరంజీవి జన్మదినం సందర్బంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు.
ఆలయం వెలుపలకు వచ్చిన చిరంజీవిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఆయనతో కలిసి ఫొటోలు దిగేందుకు భక్తులు ఆసక్తి కనబరిచారు. చిరంజీవితో కలిసి ఆయన సతీమణి సురేఖ, మనవ రాలు స్వామివారిని దర్శించుకున్నారు.
బుధవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో తిరుపతికి చేరకున్నారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. బుధవారం రాత్రి తిరుమల లోని ఫీనిక్స్ అతిథి గ్రుహం లో బస చేసి గురువారం ఉదయం సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించు కున్నారు.