వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలను నాశనం చేశారు

0

 కృష్ణాజిల్లా : గన్నవరం నియోజకవర్గం.

వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలను నాశనం చేశారు

గత ప్రభుత్వంలో కబ్జాలు, అక్రమాలలో గన్నవరం నియోజకవర్గం మొదటి స్థానం

ఖజానాను ఖాళీ చేసి వెళ్లిన సంక్షేమం-అభివృద్ధి ధ్యేయంగా సీఎం చంద్రబాబు పరిపాలన చేస్తున్నారు

యువతకు ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఈ నెల 14 న మెగా జాబ్ మేళా

జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణలో అసెంబ్లీ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్

రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు జరపాల్సిన దుస్థితికి, గుంతలు లేని రోడ్లు కార్యక్రమం చేసే దుస్థితికి గత ప్రభుత్వం తీసుకు వచ్చిందని ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు విమర్శించారు. గత వైసిపి ప్రభుత్వం ఒక్క రోడ్డు కూడా వెయ్యలేదని కనీసం మరమ్మత్తు కూడా చేయలేదని అన్నారు. ఈనెల 14న ఎనికేపాడు లోని గన్నవరం టిడిపి రూరల్ పార్టీ కార్యాలయంలో జరగనున్న మెగా జాబ్ మేళా పోస్టర్ ను మంగళవారం ఆయన గన్నవరం పార్టీ కార్యాలయం నందు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ రాష్ట్రంలో అనాగరిక పరిపాలన చేశారని, ఆ దుష్ట పాలనకు ప్రజలు చరమగీతం పాడారని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రెవిన్యూ రికార్డులను టాంపర్ చేశారని, చెరువులను, ప్రజల భూములను, ప్రభుత్వ భూములను, అసైన్డ్ భూములను కబ్జా చేశారని ఆరోపించారు. ఇందులో గన్నవరం నియోజకవర్గ మొదటి స్థానంలో ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం చట్టాలను కఠినతరం చేసిందని వెల్లడించారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రెవిన్యూ సదస్సులు నిర్వహించి భూములు కబ్జాకు గురైన బాధితులకు న్యాయం జరిగేలా చూస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే కాలంలో ఎవరైనా ల్యాండ్ కబ్జా చేయాలని చూస్తే జైలుకు వెళ్లేలా కఠిన చట్టాలను ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. జగన్ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి వెళ్లిన, బడ్జెట్ ప్రవేశ పెట్టలేని దుస్థితికి తీసుకువచ్చిన ఒకటో తేదీనే పెన్షన్లు పంపిణీ చేయడం కానీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కానీ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సంక్షేమం-అభివృద్ధిని రెండు కళ్ళలాగా భావిస్తూ సీఎం చంద్రబాబు పరిపాలన చేస్తున్నారని వెల్లడించారు. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా తను పనిచేస్తానని స్పష్టం చేశారు. నియోజవర్గంలోని యువతకు ఉపాధి కల్పించే దిశగా గన్నవరం రూరల్ మండల కార్యాలయంలో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వేల మందికి ఉద్యోగాల కల్పన ధ్యేయంగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని ఈ జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version