రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యం

0

 *10.12.2024*

రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యం

రైతులపై విత్తనాల భారం పడకుండా ప్రభుత్వం రాయితీపై విత్తనాలు పంపిణీ చేస్తుంది

100 శాతం రాయితీ పై మినుములు వి.బి.ఎన్ 8 రకం చిరుసంచులు పంపిణీ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్ , ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్

రైతుల శ్రేయస్సే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం శాసన సభ్యులు యార్లగడ్డ వెంకట్రావ్ అన్నారు. రబీ సీజన్ సందర్భంగా కృష్ణాజిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పోషణ మరియు ఆహార భద్రత పథకంలో భాగంగా రైతులకు 100 శాతం రాయితీ పై మినుములు వి.బి.ఎన్ 8 రకం చిరు సంచులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం వ్యవసాయాన్ని దండగ చేస్తే కూటమి ప్రభుత్వం పండుగలా మార్చిందన్నారు. రైతులు విత్తనాల గురించి ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వమే రాయితీ పై విత్తనాలు పంపిణీ చేస్తుందని చెప్పారు. తాను రైతు కుటుంబం నుండే వచ్చానని రైతుల కష్టాలు తనకు తెలుసునని అన్నారు. ఆరుగాలం శ్రమించే రైతుల కష్టాలను తమ ప్రభుత్వం తీరుస్తుందని ఈ సంక్రాంతి నిజమైన రైతుల సంక్రాంతి అని పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో నాయకులు వడ్రాణం హరిబాబు , దొంతు చిన్నా , జాస్తి శ్రీధర్ , బోడపాటి రవి , సతీష్ మోదుగమూడి సత్యనారాయణ జాస్తి మురళి , బసవ పూర్ణయ్య , పడమట రంగారావు తదితరులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version