విజయవాడ పశ్చిమ జాతీయ రహదారిపై జక్కంపూడి, నున్న నైనవరం అంబాపురం రైతులు పొలాల్లో అనుమతులు లేకుండా లాంకో కంపెనీ వేస్తున్న హెటెన్షన్ టవర్ల సమస్య పరిష్కారానికి కృషి చేసిన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావ్ కు విజయవాడ లోని శాసన సభ్యుని కార్యాలయం లో కలసి రైతులు ధన్యవాదాలు తెలిపారు.

0

విజయవాడ వెస్ట్‌ బైపాస్‌ రోడ్డులో ల్యాంకో ట్రాన్స్‌మిషన్‌ విద్యుత్ టవర్ల వివాదం పై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణ కమిటీ వేశారు. ఈ కమిటీ లో విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మిశా, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ ఉన్నారు. పాత అలైన్‌మెంట్‌ ప్రకారమే టవర్ల ఎత్తు పెంచి కొనసాగించాలని కమిటీ నిర్ణయించింది. నేషనల్‌ హైవే ఆర్వో కార్యాలయ అధికారులు అనాలోచితంగా, ల్యాంకో సంస్థ ప్రయోజనాల కోసం పనిచేశారని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ సీఎం దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చేయడం పట్ల రైతులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వమని, రైతులకు అన్యాయం జరిగితే సహించదని ఎమ్మెల్యే యార్లగడ్డ రైతులకు వివరించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version