రోడ్డుపైన వర్షపు నీటి నిలువలు ఉండకుండా మొన్సూన్ రెస్పాన్స్ టీం ఏర్పాటు కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు

0

విజయవాడ నగరపాలక సంస్థ
22-07-2025

రోడ్డుపైన వర్షపు నీటి నిలువలు ఉండకుండా మొన్సూన్ రెస్పాన్స్ టీం ఏర్పాటు

విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు

వర్షపు నీరు రోడ్డు పైన నిల్వ ఉండకుండా మాన్సూన్ రెస్పాన్స్ టీం ఏర్పాటు చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ ఎం అన్నారు. మంగళవారం సాయంత్రం తన పర్యటనలో భాగంగా బెంజ్ సర్కిల్, నిర్మల కాన్వెంట్ రోడ్, పోస్టల్ కాలనీ రోడ్, పంట కాలువ రోడ్డు, ఏపీఐఐసీ కాలనీ, ఆయుష్ హాస్పిటల్ రోడ్, రామవరప్పాడు జంక్షన్, ఏలూరు రోడ్డు, గుణదల సెంటర్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మొన్సూన్ రెస్పాన్స్ టీమ్ లో భాగంగా ఒక ఎనిమిటి, శానిటరీ, ప్లానింగ్ సెక్రటరీలతో కూడిన ఒక బృందాన్ని ఏర్పాటుచేసి, నగరంలో గుర్తించిన స్టాగ్నేషన్ పాయింట్లకు, పాయింట్ కి ఒక బృందాన్ని ఏర్పాటు చేసి వర్షపు నీటి నిల్వలు రోడ్డుపైన ఉండకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అవసరమైతే మోటార్ల సామర్ధ్యతను పెంచి వర్షపు నీరు ఎక్కువగా నిలువ ఉండే ప్రాంతాలలో 10 నిమిషాల కంటే వర్షపు నీరు నిలవ ఉండకుండా చర్యలు తీసుకునేటట్టు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షపు నీరు ప్రవాహానికి అడ్డొచ్చే ఎన్క్రోచ్మెంట్స్ అన్నిటిని తీసివేయాలని ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. నగరంలో గుర్తించిన రిహాబిలిటేషన్ సెంటర్లలలో ఎటువంటి మరమ్మతులు లేకుండా కనీస వసతులు కల్పించేటట్టు అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఈ పర్యటనలో అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్ డా. డి చంద్రశేఖర్, జోనల్ కమిషనర్ కె. షమ్మీ, చీఫ్ ఇంజనీర్ ఆర్. శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె.అర్జునరావు, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, పర్యవేక్షణ ఇంజనీర్లు పి. సత్యకుమారి, పి.సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జీ.సామ్రాజ్యం, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాలకృష్ణ నాయక్, సిబ్బంది పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version