పంచాయతీ రాజ్ మరియు ఆర్.డబ్ల్యు.ఎస్ శాఖల సమీక్ష సమావేశంలో పాల్గొన్న శాసనసభ్యులు కృష్ణప్రసాదు
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, 22.07.2025.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ రాజ్, మరియు గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్.డబ్ల్యు.ఎస్) శాఖల అధికారులతో సమీక్ష సమావేశంలో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పాల్గొన్నారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో ఈ సమీక్షా సమావేశం మంగళవారం జరిగింది.
ఈ సందర్భంగా ఆ శాఖల పరిధిలోని పలు సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. వర్షాలు తీవ్రంగా పడుతున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న దృష్ట్యా తగు పారిశుధ్య చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్డీఏ కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.