22-07-2025
ప్రజారోగ్యమే ఎన్డీయే కూటమి ప్రభుత్వ ధ్యేయం : టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి బొప్పన భవకుమార్
ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో బాధితులకు ఎల్.వో.సి పత్రాలు అందజేత
ముగ్గురు బాధితులకు రూ.6,95,000 లక్షలు విలువ గల ఎల్.వో.సి పత్రాలు పంపిణీ
బాధితులకు ఎల్.వో.సి పత్రాలు అందజేసిన బొప్పన భవకుమార్
విజయవాడ : రాష్ట్రంలోని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనేది ఎన్డీయే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, అందుకోసమే అనారోగ్యం బారిన పడిన వారికి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఆర్ధిక సాయం అందిస్తున్నట్లు టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి బొప్పన భవకుమార్ తెలిపారు.
పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) సూచనల మేరకు టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి బొప్పన భవకుమార్ గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో మంగళవారం ముగ్గురు బాధితులకు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన రూ.6,95,000 లక్షలు విలువ గల ఎల్.వో.సి పత్రాలు అందజేశారు.
తిరువూరు నియోజకవర్గం ఎ.కొండూరు మండలం చీమలపాడు గ్రామానికి చెందిన మంజుల శిరీష కు రూ.4,50,000 లక్షలు, ఎ.కొండూరు మండలం కృష్ణారావుపాలెం గ్రామానికి చెందిన బర్మావతు కవిత కు రూ.1,25,000 లక్షలు, ఎ.కొండూరు మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన రూ.1,20,00 లక్షల విలువ గల ఎల్.వో.సి పత్రాల ను బాధితులకు టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి బొప్పన భవకుమార్ అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి పరిశపోగు రాజేష్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు