రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

0

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

చంద్రయ్య డ్రైన్ పరివాహక పంట పొలాల్లో పర్యటించిన ఎమ్మెల్యే….

స్థానిక రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే రాము…

నియోజకవర్గంలో రైతాంగ సమస్యల పరిష్కారంపై… ప్రణాళిక బద్ధ చర్యలు

గుడివాడ జూన్ 13:రైతులకు పెద్దపీట వేస్తూ.. అనేక పథకాలు, రాయితీలను అందిస్తూ.. లక్షల ఎకరాలకు సాగునీరు విడుదల చేస్తూ.. వారి అభ్యున్నతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు.

గుడివాడ పట్టణం కంకిపాడు రోడ్డులో గల చంద్రయ్య డ్రైన్ పరివాహక పంట పొలాల్లో ఎమ్మెల్యే రాము శుక్రవారం ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా పేద ఎరుకపాడు, బేతవోలు, పరివాహక రైతులతో ఎమ్మెల్యే రాము మాట్లాడారు.పలు అంశాలపై రైతులతో మాట్లాడిన ఎమ్మెల్యే రాము, వారికి ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

చంద్రయ్య డ్రైన్ కట్ట పటిష్టంగా లేకపోవడంతో వరదలు వచ్చిన ప్రతిసారి గండ్లు పడి పంటలు మునుగుతున్నాయని రైతులు ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకువచ్చారు.

చంద్రయ్య డ్రైన్ పరివాహక రైతుల సమస్యలపై తనకు అవగాహన ఉందని…. కట్టపటిష్టానికి ఇప్పటికే 10 లక్షలతో అంచనాలు రూపొందించామని త్వరలో ఆ పనులు మొదలవుతాయని రైతులతో ఎమ్మెల్యే రాము అన్నారు.

అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ నియోజకవర్గంలో రైతాంగ సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని ఎన్నికల ముందు వారి సమస్యలను ప్రత్యక్షంగా చూశానన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతాంగ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే రాము చెప్పారు.

ఇప్పటికే ఆ దిశగా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రణాళిక బద్ధ చర్యలు తీసుకొని సమస్యల పరిష్కారానికి విజయవంతంగా చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే రాము తెలిపారు.

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే రాము అన్నారు.గత వైకాపా ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందన్నారు. త్వరలోనే అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్ సుబ్బారావు, కూటమి నాయకులు దారపు రెడ్డి మనీశ్వరరావు,దారపురెడ్డి శేషు, గూడపాటి రాజు,కడవకల్లు ఆంజనేయులు, మండపాక గంగయ్య, అనంతదాసు సుబ్రహ్మణ్యం, రాజనాల సురేష్, వాసుపల్లి ఉమ శంకర్,కటికల కళ్యాణ్, చిన్నబాబు ,ఆదం, మోహన్, కమల బాబ, బేతవోలు, ఎరుకపాడు, సి పూడి గ్రామాల రైతులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version