రూ 7 కోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
రాబోయే రోజుల్లో మరింత మెరుగైన సేవలు అందిస్తా..
ఎమ్మెల్యే సుజనా చౌదరి
ఎమ్మెల్యే సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గంలోని మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నారు.
ఇప్పటికే విద్య, వైద్యం, ఆరోగ్య పరంగా సేవలందిస్తున్న సుజనా
డ్రైనేజీల ఆధునీకరణకు శ్రీకారంచుట్టారు.
దశాబ్దాలుగా అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా శుక్రవారం పశ్చిమలోని 43&45 పరిధిలో మూడువేల 550 మీటర్లు, 54&55 డివిజన్ల పరిధిలో 1050 మీటర్లు, 39&44 డివిజన్ల లో 1270 మీటర్లు పొడవైన స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు నిర్మాణం 7 కోట్ల రూపాయల అంచనాల నిధులతో చేపట్టనున్న స్ట్రాంమ్ వాటర్ డ్రైన్ ల, అభివృద్ధి పనులకు కూటమి నేతలతో కలిసి శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా సుజనా మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానని అందులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు . పశ్చిమ లోని డ్రైనేజీ వ్యవస్థ ను మెరుగుపరచడానికి రూ 7 కోట్ల నిధులతో స్ట్రామ్ వాటర్ డ్రైన్లకు, నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించి పనులను సకాలంలో పూర్తిచేయాలని సంబంధిత అధికారులను సుజనా ఆదేశించారు. మొదటి ఏడాది పాలన అనుకున్న స్థాయిలో సంతృప్తినివ్వలేదని రాబోయే రోజుల్లో మరింత మెరుగైన పాలనను అందించడమే తన లక్ష్యమన్నారు. ప్రమాదంలో గాయపడినప్పుడు
కూటమి నేతలు,పశ్చిమ ప్రజలు చూపిన అభిమానం మరువలేనిదన్నారు. వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు..
ప్రజా సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఎవరికి ఏ సమస్య ఉన్నా నిత్యం ఎన్డీఏ కార్యాలయం అందుబాటులో ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఈ ఈ సురేఖ, డీ ఈ పురుషోత్తం, డీ ఈ కరుణాకర్, ఏ ఈ లు ఖలీల్ భాష, శ్రీనివాసరావు, రామకృష్ణ,
టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా , ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు,టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్ ఎస్ బేగ్, కోగంటి రామారావు , కార్పొరేటర్లు బుల్లా విజయ్ కుమార్, అర్షద్ ,ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి) గుడివాడ నరేంద్ర రాఘవ, మరుపిల్ల రాజేష్, అత్తలూరి ఆదిలక్ష్మి పెద్దబాబు, మహాదేవు అప్పాజీరావు ,మైలవరపు దుర్గారావు, మైలవరపు కృష్ణ, మొరబోయిన రాంబాబు, పగడాల కృష్ణ,బొల్లేపల్లి కోటేశ్వరరావు, వై విశ్వేశ్వరరావు,
యేదుపాటి రామయ్య, శివాజీ ముదిరాజ్, పైలా సురేష్, బెవర మురళి, రెడ్డి పల్లి రాజు, షేక్ అబ్దుల్ అజీజ్, దుర్భేశుల హుస్సేన్ , నున్న కృష్ణ ,దీటి ప్రభుదాస్, తదితరులు పాల్గొన్నారు