సుజనా చౌదరి ను కలిసిన
ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ
(సుజనా చౌదరి) ను విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మర్యాదపూర్వకంగా కలిశారు.
మే నెలలో ప్రమాదవశాత్తు గాయపడిన సుజనా చౌదరి వైద్యుల సూచనలు మేరకు విశ్రాంతి తీసుకున్నారు. తిరిగి కోలుకున్న ఆయన విజయవాడ రావడంతో తాడిగడపలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విష్ణుకుమార్ రాజు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి పలు అంశాలపై ఇరువురు చర్చించారు