పశ్చిమ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తా
ముఖాముఖి కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి
తనపై నమ్మకంతో 47 వేల మెజారిటీ ఇచ్చి గెలిపించిన పశ్చిమ ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించి వారి జీవన ప్రమాణాలను మెరుగు పరుస్తానని ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు.
కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమం గురించి ప్రజలతో మమేకమై ముఖాముఖి చర్చలు జరిపారు.
చిట్టినగర్ లోని మోతి మసీద్ ప్రాంగణంలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి , టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ , టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్ ఎస్ బేగ్ , దుర్గమ్మ గుడి మాజీ చైర్మన్ పైలా సోమినాయుడు టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ ఏడాది పాలనలో పశ్చిమ నియోజకవర్గంలో విద్య, వైద్యం, ఆరోగ్య రంగాలకు ప్రాధాన్యతనిస్తూ ఉద్యోగ ,ఉపాధి అవకాశాలను కల్పించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. అవినీతికి తావు లేకుండా చందాలు, దందాలు లేకుండా రాజకీయాలకతీతంగా నిస్వార్ధంగా సేవలందిస్తున్నామని తెలిపారు.
వైసీపీ కార్పొరేటర్లు సహకరించడం పోవడం వలన అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడిందన్నారు
ఎన్నికలవరకే ప్రత్యర్థులని తర్వాత అందరూ ఒకటేనన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో ప్రతి ఒక్కరికి సమన్యాయ పాలన అందించడమే తన లక్ష్యమన్నారు.
22 డివిజన్లలో సుజనా మిత్రా కోఆర్డినేటర్లను ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తున్నామని తెలిపారు
త్వరలోనే సుజనా న్యాయ మిత్రా లను ఏర్పాటు చేసి పేద ప్రజలకు ఉచితంగా న్యాయ సహాయం అందేలా చూస్తామన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసి ప్రధాని మోడీ నేతృత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహకారం తో రాబోయే రోజుల్లో మరింత మెరుగైన సేవలను అందించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. తనకు ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే సుజనా చౌదరి భావోద్వేగంగా ప్రసంగించారు.
టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా మాట్లాడుతూ మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో పశ్చిమ లో 47 వేల మెజారిటీ సాధించిన మొదటి వ్యక్తి సుజనా చౌదరి అన్నారు .
పశ్చిమ లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిస్తూ విద్యా, వైద్యం ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పశ్చిమ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి అభివృద్ధి ప్రణాళికలను సుజనా చౌదరి రూపొందిస్తున్నారని అన్నారు.
ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ
ఇటీవల సీఎం చంద్రబాబును కలిసినప్పుడు పశ్చిమ నియోజకవర్గం లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం కూటమినేతలకు సుజనా చౌదరి అందిస్తున్న సహకారం గురించి తెలియజేశామన్నారు.
175 నియోజకవర్గాల్లో పశ్చిమ నియోజకవర్గం సుజనా నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకెళుతుందన్నారు.
ఏడాది కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సుజనా చౌదరి బాధితులకు రూ 2 కోట్ల కు పైగా చెక్కులను అందించడం సంతోషకరమన్నారు. ప్రతి ఒక్కరికి సమాన గౌరవం ఇస్తూ ఎమ్మెల్యే సుజనా చౌదరి అవినీతి రహిత పాలన అందిస్తున్నారని అడ్డూరి శ్రీరామ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బుల్లా విజయ్ కుమార్,మైలవరపు రత్నకుమారి దుర్గారావు, మహాదేవు అప్పాజీరావు, అత్తలూరి ఆదిలక్ష్మి పెద్దబాబు, ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి) మారుపిళ్ళ రాజేష్, మహాదేవు అప్పాజీరావు ఎన్డీఏ కూటమి నేతలు కోగంటి రామారావు,పోతిన భేసు కంటేశ్వరుడు, రెడ్డిపల్లి రాజు, పైలా సురేష్ బెవర మురళి,నాగోతి రామారావు, పడాల గంగాధర్, మల్లెపు విజయలక్ష్మి, ఒమ్మి అన్నపూర్ణ,వేవిన నాగరాజు, రుద్రపాటి వెంకటేష్, పచ్చిపులుసు శివప్రసాద్, రేగళ్ల లక్ష్మణరావు,గన్నవరపు శ్రీనివాసరావు, ఆకుల రవిశంకర్ సారిపల్లి రాధాకృష్ణ, దేవిన హరిప్రసాద్, లోకేష్, అవ్వారు బుల్లబ్బాయి, బ్రహ్మారెడ్డి, మైనంపాటి రమేష్, పచ్చవ మల్లికార్జున, మంగళపురి మహేష్, వేంపలి గౌరీ శంకర్,సుజనా మిత్ర కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.