విజయవాడ ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర
పాల్గొన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో జగన్నాధుడి రథయాత్ర శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది.
భవానిపురం ,సితార
లేబర్ కాలనీ గ్రౌండ్స్ లో ప్రారంభమైన రథయాత్రలో మాజీ ఎంపీ గోకరాజు గంగ రాజు ,కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు.
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రథయాత్రగా పేరుగాంచిన ఇస్కాన్ విజయవాడ జగన్నాథ స్వామి రథయాత్ర పశ్చిమ నియోజకవర్గం లో ప్రారంభించడం సంతోషకరమని సుజనా తెలిపారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది రధ యాత్రను పశ్చిమ నియోజకవర్గంలో ప్రారంభించాలని ఇస్కాన్ విజయవాడ ప్రెసిడెంట్ చక్రధరి దాస్ ప్రభుజీ ని కోరగా తమ కోరిక మేరకు పశ్చిమంలో ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు.
ఈ రథయాత్ర సీతారా గ్రౌండ్స్ నుండి స్వాతి థియేటర్, దుర్గమ్మ ఆలయం, రధం సెంటర్ మీదుగా సాగి సీతమ్మ వారి పాదాల వద్ద ముగుస్తుంది.
మూడు రోజులు పాటు జరిగే ఈ కార్యక్రమంలో మొదటిరోజు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు
సుజనా చౌదరి జగన్నాధుడికి మొదటి హారతి ఇచ్చారు. అనంతరం మాజీ ఎంపీ గోకరాజు గంగ రాజు, ఇస్కాన్ ప్రభుజీ లతో కలిసి(చేరాపహరాను) జగన్నాడుడి రథం ముందు బంగారు , వెండి చీపుర్లతో శుభ్రపరిచారు