అమరావతి,
12.06.25.
రాష్ట్రంలో న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ (NDB) ఆధ్వర్యంలో చేపట్టిన రహదారుల అభివృద్ధిని సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించిన రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి..
• నేడు విజయవాడలోని ఆర్ & బీ శాఖ ఈఎన్ సీ కార్యాయలంలో NDB రహదారుల అభివృద్ఢి పనుల పురోగతిపై మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆధ్వర్యంలో NDB ప్రతినిధులు, ఆర్ & బీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం..
• మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆర్ & బీ శాఖ ఈ ఎన్ సీ నయిముల్లా, ఏపీఆర్డీసీ ఎండీ శ్రీనివాసరెడ్డి, NDB ప్రతినిథులు, ఇతర ఉన్నతాధికారులు..
• వచ్చే ఏడాది చివరి నాటికి NDB రోడ్ల అభివృద్ధి పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా ఒక నిర్ధిష్ట ప్రణాళికతో సాగాలని అధికారులకు మంత్రి ఆదేశం..
• NDB కింద ఇప్పటి వరకు రూ. 637.76 కోట్ల మేర పనులు పూర్తి కాగా రూ. 488.30 కోట్ల మేర వ్యయం చేయడం జరిగింది.. వచ్చే ఏడాది NDB రోడ్ల అభివృద్ధి పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం…
• ఈ సమీక్షా సమావేశంలో జిల్లాల వారీగా NDB రోడ్ల పనుల పురోగతిపై వివరాలను అధికారులను ఆరా తీసిన మంత్రి..
• కొన్ని జిల్లాలో NDB రోడ్ల అభివృద్ధి పనులు ఆలస్యం కావడానికి కారణాలు అడిగి తెలుసుకున్న మంత్రి… జాప్యానికి కారణాలు తెలుసుకుని, ఆయా సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన మంత్రి..
• అదే సమయంలో NDB నుంచి రావాల్సిన నిధుల విషయంలో ఎక్కడ జాప్యం జరుగుతుందని అధికారులను ప్రశ్నించిన మంత్రి
• రోడ్ల అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి కావడానికి నిధులు కొరత తలెత్తకుండా.. NDB నుంచి నిధులు తెచ్చుకోవడంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని అధికారులకు మంత్రి ఆదేశం..
• ఈ సందర్భంగా NDB ప్రతినిధులను శాలువాతో సన్మానించి, శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రతిమను అందజేసిన సత్కరించిన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి..
• కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో NDB పనులు జరుగుతున్న తీరుపై సంతోషం వ్యక్తం చేసిన NDB ప్రతినిధులు..
• గత 10 నెలలుగా రాష్ట్రంలో NDB రహదారుల పనుల అభివృద్ధిలో గుర్తించదగిన పురోగతి ఉందంటూ ఆనందం వ్యక్తం చేసిన NDB ప్రతినిధులు..
• మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్ & బీ శాఖ NDB పనులను తిరిగి చేపట్టి పనుల పురోగతిలో కీలకంగా వ్యవహారించిదన్న NDB ప్రతినిధులు..
• ఈ సమావేశంలో పాల్గొన్న ఆర్ & బీ శాఖ ఈ ఎన్ సీ నయిముల్లా, ఏపీఆర్డీసీ ఎండీ శ్రీనివాసరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు..