రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపు తథ్యం: నందమూరి రామకృష్ణ

0

 రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపు తథ్యం: నందమూరి రామకృష్ణ

రానున్న ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావు ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను కోరారు. నందమూరి రామకృష్ణ

ఉంగుటూరు మండలం: 

టీడీపీ-జనసేన-బి.జె.పి గన్నవరం నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు మరియు ముఖ్య అతిథిగా నందమూరి రామకృష్ణ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గురువారం సాయంత్రం ఉంగుటూరు మండలం మానికొండ, తరిగొప్పల, వెంపాడు గ్రామాల్లో జన ప్రభంజనం మద్య ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

స్ధానిక ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యలను వింటూ పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ ఎన్నికల ప్రచారం ముందుకు సాగింది. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న టీడీపీ, జనసేన, బి.జె.పి శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారానికి హాజరయ్యారు. రాబోయే ఎన్డీయే కూటమి సంకీర్ణ ప్రభుత్వంలో ప్రజలకు అందించనున్న పధకాలను,గన్నవరం నియోజకవర్గ అభివృద్ధికి యార్లగడ్డ ప్రత్యేకంగా రూపొందించిన సూపర్ సిక్స్ ప్రణాళికను తెలియజేస్తూ ముద్రించిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు.

ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని, సమాజంలో ప్రతి పౌరుడు భాద్యతతో ఆలోచించి తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని కోరారు. పతనమైన రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను పునరుధ్ధరించి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా చేయగల సమర్ధుడు నారా చంద్రబాబునాయుడని ఆయన్ను తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి చేయాల్సిన భాధ్యత ప్రజలపై ఉందని తెలిపారు. 

ఆడబిడ్డలకు అండగా ఉండేందుకు 18 సం॥లు నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ. 1500, తల్లికి వందనం కింద చదువుతున్న ప్రతి చిన్నారికి సంవత్సరానికి రూ. 15 వేలు, ప్రతి పేదకుటుంబానికి సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలెండర్లు, అవ్వతాతలకు ఎప్రియల్ నెలనుండే నెలకు రూ. 4000 పింఛన్లు, నిరుద్యోగ యువతకు సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగ, ఉపాది అవకాశాల కల్పన తదితర పధకాలను ఎటువంటి వివక్ష లేకుండా అందించి పేద ప్రజలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గన్నవరం నియోజకవర్గంలోని పేదలను గుర్తించి 15 వేల మందికి ఇళ్ల స్థలాలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ హక్కులను కాపాడటానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని, రాజ్యాంగం వారికి కల్పించిన హక్కులను చట్టబద్దంగా అమలు చేసి సాధికార సంక్షేమాన్ని అందిస్తామని యార్లగడ్డ భరోసా ఇచ్చారు.  

పారిశ్రామిక రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి యువతకు ఉద్యోగం, ఉపాది కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

చంద్రబాబునాయుడుకి సంపద సృష్టించగల సమర్ధత ఉందని, స్పష్టమైన విజన్ ఉన్న నాయకుడని, యువత కలల సౌధాన్ని నిర్మించడం అలాంటి నాయకత్వానికే సాధ్యం అని స్పష్టం చేశారు. నవ్యాంధ్రప్రదేశ్ సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ గా నిలవాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడు సారధ్యంలోనే సాధ్యం అవుతుందన్నారు.

 ప్రజలందరూ ఎన్డీయే కూటమికి మద్దతు పలికి సైకిల్ గుర్తుకు ఓటు వేసి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి అహర్నిశలు కృషిచేసే తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని ఓటర్లను అభ్యర్ధించారు.

 ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఆరుమల్ల వెంకట కృష్ణారెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు మండవ రమ్య,ఆరికట్ల రవికుమార్ ఎడ్లపల్లి సాయి , బెజవాడ నాగేశ్వరావు,ఐనంపూడి భువనేష్ ,షేక్ అజిజ్, వత్తికూటి కిషోర్, బడుగు కిషోర్,రహీమ్ భాష, రాసూల్, నజీర్ అబ్దుల్లా, భాషి, మొహ్మద్, అల్లా భక్షు, సుబని,దాసరి రవళి, తోట పండు,పాతూరి రాజ్ కుమార్, లాబాను,పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version