రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాదు.. ‘రెడ్ బుక్’ రాజ్యాంగం నడుస్తోంది మాజీ మంత్రి వెలంపల్లి

Spread the love

రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాదు.. ‘రెడ్ బుక్’ రాజ్యాంగం నడుస్తోంది మాజీ మంత్రి వెలంపల్లి

భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులతో కలిసి మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్‌సీపీ ఇన్‌ఛార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రూపొందిన రాజ్యాంగాన్ని కాకుండా, కేవలం ‘రెడ్ బుక్ రాజ్యాంగాన్ని’ మాత్రమే అమలు చేస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ సహా కూటమిలోని ఏ ఒక్క పార్టీ కూడా రాజ్యాంగాన్ని అమలు చేసే పరిస్థితిలో లేదని వెలంపల్లి విమర్శించారు. రాష్ట్రంలో స్వార్థ రాజ్యాంగాలు, రెడ్ బుక్ రాజ్యాంగాలు, రాజకీయ రాజ్యాంగాలతో కూడిన కుటుంబ పరిపాలన సాగుతోంది తప్ప, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల రాజ్యాంగం ఎక్కడా అమలు కాకపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

గత వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సముచిత పదవులు ఇవ్వడం కావచ్చు, మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం కావచ్చు.. ప్రతి ఒక్కటీ రాజ్యాంగ స్ఫూర్తితోనే జరిగాయని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రజలందరూ గమనించాలని కోరారు.

రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచకాలపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం జోక్యం చేసుకుని వీటిని అరికట్టకపోతే, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయిపోతుందని ఆయన హెచ్చరించారు.

Loading